ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. గత వారం భారత మార్కెట్లో విడుదల చేసిన పోకో ఎక్స్8 ప్రో సిరీస్ అమ్మకాలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర, ఆఫర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. పోకో ఎక్స్8 ప్రో- స్పెసిఫికేషన్లు, ధర..

ఈ స్మార్ట్‌ఫోన్ 6.69- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్.
కెమెరా: వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్), 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 100డబ్ల్యూ హైపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.
ధరలు: 8 GB + 256 GB: రూ. 32,999
12 GB + 256 GB: రూ. 35,999
12 GB + 256 GB (ఐరన్ మ్యాన్ ఎడిషన్): రూ. 37,999
2. పోకో ఎక్స్8 ప్రో మాక్స్- విశేషాలు..
ఇది ఈ పోకో సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇందులో 6.83- ఇంచ్ భారీ అమోలెడ్ డిస్ప్లే ఉంది.
ప్రాసెసర్: ఇందులో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్‌ను వాడారు.
బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 8,500ఎంఏహెచ్ బ్యాటరీ. దీనికి కూడా 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధరలు: 12 GB + 256 GB: రూ. 42,999
12 GB + 512 GB: రూ. 46,999
AI House search : అద్దె ఇల్లు వెతకడం కష్టంగా ఉందా? 'ఏఐ' ఉండగా ఇక శ్రమ ఏందుకు?
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- ఏఐ ఫీచర్లు..
ఈ రెండు ఫోన్లలో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ డైనమిక్ వాల్‌పేపర్స్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- లాంచ్ ఆఫర్లు..
మొదటి సేల్‌లో భాగంగా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల బేస్ మోడల్‌ను రూ. 29,999 కే సొంతం చేసుకోవచ్చు.