...
...
Next Story

Re NEET result date 2026 : నీట్​ యూజీ రీ-ఎగ్జామినేషన్ ఫలితాల తేదీ, సీట్ల కేటాయింపు అప్డేట్స్..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్​ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ అభ్యర్థులకు కీలక అప్డేట్! ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు జులై 20, 2026 లోపు ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోంది.

Published on: Jul 6, 2026, 09:59:02 IST
Advertisement

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జులై 20, 2026న లేదా అంతకంటే ముందే నీట్​ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల ప్రకటనలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసి, ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియను సకాలంలో ప్రారంభించాలని ఎన్టీఏ పట్టుదలగా ఉందని సమాచారం.

నీట్​ ఎగ్జామ్ సెంటర్​ వద్ద విద్యార్థులు..
నీట్​ ఎగ్జామ్ సెంటర్​ వద్ద విద్యార్థులు..

పరిక్ష ఫలితాలను కటాఫ్ మార్కులు, రిజిస్టర్డ్ అభ్యర్థులు, హాజరైన- అర్హత సాధించిన వారి సంఖ్యతో కూడిన సమగ్ర పీడీఎఫ్ రూపంలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఇందులో రాష్ట్రాల వారీగా ఫలితాల గణాంకాలు కూడా ఉంటాయి. అయితే, విద్యార్థులు తమ వ్యక్తిగత మార్కుల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ ఫలితాల తేదీ, సమయం..

ఫలితాల విడుదల తేదీ: జులై 20, 2026 న లేదా అంతకంటే ముందు

ఆశించదగిన సమయం: సాయంత్రం 7.00 గంటల లోపు

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాలు చూసుకోవడం ఎలా?

అభ్యర్థులు తమ నీట్​ యూజీ 20226 ఫలితాలను సులభంగా చూసుకోవడానికి కింది దశలను అనుసరించవచ్చు:

మొదట అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించండి.

హోమ్‌పేజీలో కనిపించే 'Re-NEET UG 2026 Result' లింక్‌పై క్లిక్ చేయండి.

స్క్రీన్‌పై కనిపించే వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి.

ఫలితాల పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.

నీట్ స్కోర్‌కార్డ్ 2026 డౌన్‌లోడ్ ప్రక్రియ..

కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులకు స్కోర్‌కార్డ్ అత్యంత కీలకం. దీనిని డౌన్‌లోడ్ చేయడానికి:

'Download NEET Scorecard 2026' ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ (లేదా పుట్టిన తేదీ) ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది, దానిని ప్రింట్ తీసుకోండి.

ఆగస్టు లేదా సెప్టెంబరులో ఎంబీబీఎస్ క్లాసులు!

గతేడాది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నీట్ ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే, అంటే జులై 12-13 తేదీల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అనంతరం జులై 21 నుంచి మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

సాధారణంగా నీట్ ప్రక్రియ సజావుగా సాగితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ ప్రక్రియను వేగంగా ముగించి, క్లాసులను అనుకున్న సమయానికే ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, నీట్ ఫలితాలు రాకముందే తమ సొంత మెడికల్ సెలక్షన్ కమిటీ ద్వారా ముందస్తు ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించాయి.

సీట్ల కేటాయింపు ఇలా..

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను వెబ్‌ఆప్షన్ల ద్వారా లాక్ చేయాలి. అభ్యర్థుల నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నిబంధనలు, వారు ఎంచుకున్న ప్రాధాన్యతల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు నిర్ణీత కాలేజీలకు వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుని అడ్మిషన్ పొందాలి. మొత్తం సీట్లు భర్తీ అయ్యే వరకు రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ల రూపంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks