Realme Narzo 100 Lite : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, బోలెడు ఏఐ ఫీచర్లు- రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
Budget friendly smartphone : రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. దాని పేరు రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ. ఈ మొబైల్ ఫీచర్స్, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
Realme Narzo 100 Lite 5G price : రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ'ని ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఈ ఫోన్ అలరించనుంది.

గతేడాది విడుదలైన నార్జో 80 లైట్ 5జీకి సక్సెసర్‌గా వచ్చిన ఈ ఫోన్.. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్, దృఢత్వం కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 21 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్‌మీ నార్జ్ 100 లైట్ 5జీ- కీలక ఫీచర్లు..
1. టైటాన్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్:
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ.
ఇది సాధారణ వినియోగంతో రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
రివర్స్ ఛార్జింగ్: ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడుకుని ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు!
ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్: ఈ ఫోన్ -20°సీ నుంచి 53°సీ వరకు విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే, దీనికి కేవలం 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉండటం వల్ల ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
2. డిస్‌ప్లే, డిజైన్:
స్క్రీన్: ఈ రియల్‌మీ నార్జ్ 100 లైట్ 5జీ 6.8 ఇంచ్ భారీ ఎల్సీడీ డిస్‌ప్లే, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
Budget Smartphone : రూ. 15వేల కన్నా తక్కువ ధరకే 6300ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్- ఫీచర్లు అదుర్స్!
ప్రొటెక్షన్: ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్, పడిపోయినా దెబ్బతినకుండా ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది థండర్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
3. పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్‌వేర్:
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
స్టోరేజ్: 4జీబీ/ 6జీబీ ర్యామ్ ఆప్షన్లతో పాటు 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సదుపాయం ఉంది. మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఓఎస్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0పై ఈ రియల్‌మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. ఇందులో 'ఏఐ స్మార్ట్ లూప్', 'ఏఐ డాక్యుమెంట్ మోడ్' వంటి ఉత్పాదకతను పెంచే ఫీచర్లు ఉన్నాయి.
4. కెమెరా విభాగం:
బడ్జెట్ ఫోన్ కావడంతో కెమెరాలు యావరేజ్‌గా ఉన్నాయి. వెనుక వైపు 13ఎంపీ ఏఐ కెమెరా, ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఫోటోల్లో అనవసర వ్యక్తులను తొలగించడానికి 'ఏఐ ఎరేజర్ 2.0' వంటి ఏఐ ఫీచర్లను జోడించారు.
రియల్‌మీ నార్జ్ 100 లైట్ 5జీ- ధర, లభ్యత..
రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
4 GB + 64 GB: రూ. 13,499
4 GB + 128 GB: రూ. 14,499
6 GB + 128 GB: రూ. 16,499
లాంచ్ ఆఫర్: ఏప్రిల్ 21న అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో జరిగే మొదటి సేల్‌లో భాగంగా రూ. 1,500 వరకు కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో బేస్ వేరియంట్ ఎఫెక్టివ్ ధర రూ. 12,499కే లభించనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీలో బ్యాటరీ కెపాసిటీ ఎంత?
ఇందులో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 15డబ్ల్యూ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
2. ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉందా?
అవును, దీనికి ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది, ఇది సాధారణ నీటి చినుకులను తట్టుకోగలదు.
3. ఈ ఫోన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది?
ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
4. ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి?
ఇది ఫోన్ అకస్మాత్తుగా చేతిలో నుంచి కింద పడినా గట్టి దెబ్బలు తగలకుండా రక్షణ కల్పించే ప్రత్యేక బిల్డ్ క్వాలిటీ.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


