Best family SUV : డస్టర్ వర్సెస్ క్రెటా- ఏ ఫ్యామిలీ ఎస్‌యూవీలో.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ?
Renault Duster vs Hyundai Creta : భారత మార్కెట్లోకి 2026 రెనాల్ట్ డస్టర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన ప్రధాన ప్రత్యర్థి హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే పరిమాణంలో పెద్దదిగా, ధరలో తక్కువగా ఉంటూ గట్టి పోటీనిస్తోంది. పెట్రోల్ పవర్‌ట్రెయిన్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన డస్టర్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఒకప్పుడు భారత రోడ్లపై ఎస్‌యూవీ అంటే డస్టర్ అనేలా పేరు తెచ్చుకున్న రెనాల్ట్, ఇప్పుడు తన నెక్ట్స్ జనరేషన్ మోడల్‌తో మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త డస్టర్ రూపుదిద్దుకుంది! మరి ఈ రెండు ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏయే అంశాల్లో ఏది పైచేయి సాధించిందో ఓసారి విశ్లేషిద్దాం.

రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా- కొలతలు..
2026 రెనాల్ట్ డస్టర్ పాత మోడల్ కంటే మాత్రమే కాదు, క్రెటా కంటే కూడా పెద్దదిగా ఉంది!
పొడవు: డస్టర్ 4,346 ఎంఎం (క్రెటా కంటే 16 ఎంఎం ఎక్కువ).
వెడల్పు: 1,815 ఎంఎం (క్రెటా కంటే 25 ఎంఎం ఎక్కువ).
ఎత్తు: 1,703 ఎంఎం (క్రెటా కంటే 68 ఎంఎం ఎక్కువ).
వీల్‌బేస్: 2,657 ఎంఎం (క్రెటా కంటే 47 ఎంఎం ఎక్కువ).
దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్థలం మెరుగ్గా ఉంటుంది. ఇక లగేజ్ స్పేస్ (బూట్ స్పేస్) విషయానికి వస్తే, డస్టర్‌లో 518 లీటర్ల స్థలం ఉండగా, క్రెటాలో 433 లీటర్లు మాత్రమే ఉంది. అంటే లాంగ్ ట్రిప్స్‌కు డస్టర్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
| Dimension | Renault Duster | Hyundai Creta | Difference |
|---|---|---|---|
| Length | 4,346 mm | 4,330 mm | -16 mm |
| Width | 1,815 mm | 1,790 mm | -25 mm |
| Height | 1,703 mm | 1,635 mm | -68 mm |
| Wheelbase | 2,657 mm | 2,610 mm | -47 mm |
| Boot Space | 518 litres | 433 litres | -85 litres |
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
ఇక్కడ రెండు కంపెనీలు భిన్నమైన వ్యూహాలను అనుసరించాయి.
డస్టర్: ఈ ఎస్‌యూవీ పూర్తిగా పెట్రోల్ వెర్షన్లలోనే లభిస్తుంది. 1-లీటర్ టర్బో పెట్రోల్ (100 bhp), 1.3-లీటర్ టర్బో పెట్రోల్ (163 bhp) ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది.
క్రెటా: హ్యుందాయ్ మాత్రం పెట్రోల్ (1.5L), టర్బో పెట్రోల్ (1.5L) తో పాటు డీజిల్ (1.5L) ఇంజిన్ ఆప్షన్‌ను కూడా ఇస్తోంది. డీజిల్ కార్లను ఇష్టపడే వారికి ఇప్పటికీ క్రెటానే బెస్ట్ ఆప్షన్.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా- ఫీచర్లు, సేఫ్టీ..
ఫీచర్ల విషయంలో రెండు కార్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ వంటి అత్యాధునిక ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్ స్పెషల్: గూగుల్ బిల్ట్-ఇన్ సాఫ్ట్‌వేర్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా స్పెషల్: 8-స్పీకర్ బాస్ సౌండ్ సిస్టమ్, 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, 10.25-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఉన్నాయి.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా- ధరలు..
ధర విషయంలో రెనాల్ట్ చాలా తెలివిగా వ్యవహరించింది.
రెనాల్ట్ డస్టర్: ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 18.09 లక్షలు.
హ్యుందాయ్ క్రెటా: ప్రారంభ ధర రూ. 10.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 20.20 లక్షలు.
పెట్రోల్ వేరియంట్లలో డస్టర్ ధర క్రెటా కంటే కాస్త తక్కువగా ఉండటం కస్టమర్లను ఆకర్షించే అంశం. అయితే డీజిల్ ఇంజిన్ లేకపోవడం డస్టర్‌కు కొంత ప్రతికూలత కావచ్చు.
సెగ్మెంట్‌లో కియా సెల్టోస్, టాటా సియెర్రా, స్కోడా కుషాక్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, డస్టర్ తన బ్రాండ్ వాల్యూతో క్రెటాకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న- ఆఫ్-రోడింగ్ లేదా గతుకుల రోడ్లపై ప్రయాణించడానికి ఈ రెండింటిలో ఏది ఉత్తమం?
జవాబు: గతుకుల రోడ్లు లేదా అన్-ఈవెన్ రోడ్లపై ప్రయాణించడానికి రెనాల్ట్ డస్టర్ మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. దీనికి కారణం డస్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ 212 ఎంఎం, ఇది క్రెటా (190 ఎంఎం) కంటే 22 ఎంఎం ఎక్కువ. అదనంగా, డస్టర్ సస్పెన్షన్ సెటప్ కఠినమైన రోడ్లను సులువుగా తట్టుకునేలా రూపొందించారు. అయితే, మీరు సిటీ డ్రైవింగ్, స్మూత్ హైవే రైడ్‌ను ఇష్టపడితే క్రెటా మంచి అనుభూతినిస్తుంది.
ప్రశ్న- కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసేవారికి ఏ కారులో ఎక్కువ లగేజీ స్థలం ఉంటుంది?
జవాబు: లగేజీ స్థలం విషయంలో రెనాల్ట్ డస్టర్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. డస్టర్ 518 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తుండగా, క్రెటాలో 433 లీటర్లు మాత్రమే ఉంది. అంటే డస్టర్‌లో మీరు క్రెటా కంటే దాదాపు 85 లీటర్ల అదనపు సామానును సర్దుకోవచ్చు. పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ లగేజీతో ప్రయాణించే వారికి డస్టర్ అత్యంత ప్రాక్టికల్ ఆప్షన్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


