RRB Group D Recruitment 2026 : రైల్వేలో 22195 పోస్టులు- రిజిస్ట్రేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్​..

RRB group D recruitment 2026 apply online : ఆర్​ఆర్బీ గ్రూప్​- డీ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 22195 పోస్టులకు జరుగుతున్న ఈ దఫా రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 27, 2026, 10:17:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులు, రైల్వేలో ఉద్యోగం పొందాలని చూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) గ్రూప్-డీ పోస్టుల భర్తీకి సంబంధించి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను త్వరలోనే ముగించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన rrbapply.gov.in ద్వారా ఈ ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ అప్డేట్స్​..
ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ అప్డేట్స్​..

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈసారి మొత్తం 22,195 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం- జనవరి 31, 2026

రిజిస్ట్రేషన్​కి చివరి తేది- మార్చ్​ 2, 2026.

అప్లికేషన్​ ఫీజు చెల్లించేందుకు గడువు- మార్చ్​ 4, 2026

దరఖాస్తు కరెక్షన్​కి గడువు- మార్చ్​ 5 నుంచి మార్చ్​ 14, 2026 వరకు.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ బోర్డు/ యూనివర్సిటీ నుంచి సీఈఎన్​ (సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు)లో సూచించిన విధంగా అవసరమైన విద్యా లేదా సాంకేతిక అర్హతలను కలిగి ఉండాలి. అది కూడా.. ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ( 02.03.2026) నాటికి పొంది ఉండాలి.

అంతేకాకుండా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలోనే ఉండాలి.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము వివరాలు..

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఎక్స్​ సర్వీస్​మెన్​ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు పరీక్షా రుసుము రూ. 250/- మాత్రమే.

ఆర్​ఆర్బీ గ్రూప్​- డీ రిక్రూట్​మెంట్​ 2026 అభ్యర్థులందరికీ రిజిస్ట్రేషన్​ ఫీజు రూ. 500/-.

ఈ ఫీజు నుంచి, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కి హాజరైన అభ్యర్థులకు (బ్యాంక్ ఛార్జీలను మినహాయించి) రూ. 400/- నిర్ణీత సమయంలో తిరిగి రీఫండ్ చేస్తారు.

ఫీజు పేమెంట్​ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు లేదా యూపీఐ ద్వారా చేయవచ్చు.

కేవలం సీబీటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు మాత్రమే పైన పేర్కొన్న విధంగా పరీక్షా రుసుము రీఫండ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.

ఆర్​ఆర్బీ గ్రూప్​ డీ రిక్రూట్​మెంట్​ 2026- ఇలా రిజిస్టర్​ చేసుకోండి..

స్టెప్​ 1- ముందుగా ఆర్​ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లోకి వెళ్లండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో ఉన్న 'RRB Group D Recruitment 2026' రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. (డైరక్ట్​ లింక్​ కింద ఉంది).

స్టెప్​ 3- అనంతరం, ఓపెన్ అయ్యే కొత్త పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్​ చేయాలి.

స్టెప్​ 4- 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్​ని స్క్రీన్​పై చూడవచ్చు.

స్టెప్​ 5- అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్​ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6- సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్​ చేసుకుని, సబ్మిట్​ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 7- భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్ కాపీని (ప్రింటౌట్) తీసుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌ను చెక్​ చేస్తూ ఉండాలని అధికారులు వివరించారు.

ఆర్​ఆర్బీ గ్రూప్​- డీ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- రైల్వే గ్రూప్-డీ పరీక్షా రుసుము ఎప్పుడు రీఫండ్ అవుతుంది?

సమాధానం- పరీక్షా రుసుము రీఫండ్ అనేది అభ్యర్థి మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు హాజరైన తర్వాత మాత్రమే జరుగుతుంది. పరీక్ష ముగిసిన కొన్ని నెలల తర్వాత, అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించుకోవడానికి రైల్వే బోర్డు ఒక లింక్‌ను అందుబాటులోకి తెస్తుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక, బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.

ప్రశ్న- అప్లికేషన్‌లో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందా?

సమాధానం- అవును, ఉంది. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత మార్చి 5 నుంచి మార్చి 14, 2026 వరకు ‘మాడిఫికేషన్ విండో’ అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని ప్రాథమిక వివరాలు మార్చడానికి వీలుండదు. అలాగే సవరణలు చేసినందుకు అభ్యర్థులు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More