...
...
Next Story

Sameer Rizvi: కుర్రాడు మళ్లీ కుమ్మేశాడు.. ఢిల్లీని గెలిపించిన సమీర్ రిజ్వీ.. ఈ ఆటగాడి ఐపీఎల్ రేట్ తెలిస్తే షాకే!

Sameer Rizvi: ఢిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు సమీర్ రిజ్వీ మరోసారి చెలరేగాడు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ కుమ్మేశారు. తన టీమ్ ను మళ్లీ గెలిపించాడు. ముంబయి ఇండియన్స్ పై చెలరేగిపోయాడు. ఈ ఆటగాడి ఐపీఎల్ రేటు ఎంత తెలిస్తే షాక్ అవాల్సిందే.

Published on: Apr 4, 2026, 19:51:17 IST
Advertisement

ఐపీఎల్ 2026లో కుర్రాడు కుమ్మేస్తున్నాడు. 22 ఏళ్ల సమీర్ రిజ్వీ బ్యాటింగ్ లో ఊచకోత కోస్తున్నాడు. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను తన బ్యాటింగ్ తో సమీర్ రిజ్వీ గెలిపించాడు.

సమీర్ రిజ్వీ బ్యాటింగ్

సమీర్ రిజ్వీ (PTI)
సమీర్ రిజ్వీ (PTI)

సమీర్ రిజ్వీ బ్యాటింగ్ లో చెలరేగుతున్నాడు. శనివారం (ఏప్రిల్ 4) ముంబయి ఇండియన్స్ తో పోరులో ఈ కుర్రాడు అదిరే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి.

ఢిల్లీ విక్టరీ

సమీర్ రిజ్వీ చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ 51 రన్స్ కొట్టాడు. ఛేజింగ్ లో ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.

సమీర్ రిజ్వీ ఐపీఎల్ రేట్

ఐపీఎల్ 2026 సీజన్ లో సమీర్ రిజ్వీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 70 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. IPL 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సమీర్ రిజ్వీని రూ.95 లక్షల మొత్తానికి రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అదే రేటుకు ఢిల్లీ అతణ్ని సొంతం చేసుకుంది.

అంతకుముందు 2023 ఐపీఎల్ వేలంలో సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎస్కే తరపున అతను అంచనాలు అందుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.

ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్ 2026 సీజన్ లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా సమీర్ రిజ్వీ కొనసాగుతున్నాడు. రెండు మ్యాచ్ ల్లో కలిపి అతను 160 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఫస్ట్ రెండు మ్యాచ్ ల్లో సత్తాచాటిన సమీర్ మిగతా సీజన్ లో ఇదే ఫామ్ కొనసాగిస్తాడేమో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks