సంస్థ చరిత్రలోనే అత్యధిక క్యూ3 లాభాలను నమోదు చేయడంతో.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షేర్లు రాకెట్‌లా దూసుకెళుతున్నాయి. రూ. 1,120 వద్ద ఓపెన్ అయిన ఎస్బీఐ స్టాక్ 6శాతం మేర లాభాలతో రూ. 1137 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఇక ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఎస్బీఐ షేరు ధర 5.6శాతం లాభాలతో రూ. 1125 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఎస్బీఐ షేరు ధర- జీవితకాల గరిష్ఠానికి ఇలా..
2025 మార్చ్‌లో నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 679.65) నుంచి ఈ ఎస్బీఐ షేరు ధర ఇప్పటివరకు 65% పైగా లాభపడింది. గత ఏడాది కాలంలో 44శాతం, గత నెల రోజుల్లోనే 7శాతం మేర వృద్ధిని సాధించింది. ఐదు రోజుల్లో ఈ స్టాక్ 7శాతం పెరిగింది. నెల రోజుల్లో 12.5శాతం వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లపై లాభాల వర్షాన్ని కురిపిస్తోంది.
ఎస్బీఐ క్యూ3 త్రైమాసిక ఫలితాలు..
నికర లాభం: స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం ఏడాది ప్రాతిపదికన 24.5శాతం పెరిగి రూ. 21,028 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 16,891.44 కోట్లుగా ఉంది.
డివిడెండ్ బూస్ట్: ఐపీఓకు సిద్ధమవుతున్న ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ విభాగం నుంచి వచ్చిన రూ. 2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ బ్యాంకు లాభాలు పెరగడంలో కీలక పాత్ర పోషించింది.
ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్, అసెట్ క్వాలిటీ:
ఎస్బీఐ తన ఆదాయ వృద్ధిని, అసెట్ క్వాలిటీని గణనీయంగా మెరుగుపరుచుకుంది.
{{/usCountry}}ఎస్బీఐ తన ఆదాయ వృద్ధిని, అసెట్ క్వాలిటీని గణనీయంగా మెరుగుపరుచుకుంది.
{{/usCountry}}మొత్తం ఆదాయం: 9.7శాతం పెరిగి రూ. 1,40,914.65 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ): 9శాతం వృద్ధితో రూ. 45,190 కోట్లుగా నమోదైంది.
ఆపరేటింగ్ ప్రాఫిట్: 39.54శాతం జంప్‌తో రూ. 32,862 కోట్లకు చేరింది.
మొండి బకాయిల తగ్గింపు (ఎన్‌పీఏ): గ్రాస్ ఎన్‌పీఏ 12.71శాతం తగ్గి రూ. 73,637 కోట్లకు, నెట్ ఎన్‌పీఏ 15.74శాతం తగ్గి రూ. 18,012 కోట్లకు చేరుకున్నట్టు ఎస్బీఐ తన ఎఫ్వై26 క్యూ3 త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. గ్రాస్ ఎన్‌పీఏ నిష్పత్తి 1.57% కి మెరుగుపడింది. ఇది గత రెండు దశాబ్దాలలోనే అత్యుత్తమ స్థాయి!
మేనేజ్‌మెంట్ విశ్లేషణ - రుణ వృద్ధి అంచనాలు పెంపు..
సంస్థ భవిష్యత్తు రుణ వృద్ధిపై ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్. శెట్టి గైడెన్స్‌ను వివరించారు. అవి..
లోన్ గ్రోత్: గతంలో ఉన్న 12%–14% అంచనాను 13%–15%కి సవరించారు. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో బలమైన డిమాండ్ ఉండటమే దీనికి కారణం.
లిక్విడిటీ: క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి (సీ-డీ రేషియో) 72శాతం వద్ద సౌకర్యవంతంగా ఉంది. ఇది భవిష్యత్తులో మరిన్ని రుణాలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది.
కార్పొరేట్ పైప్‌లైన్: సుమారు రూ. 7.9 ట్రిలియన్ల విలువైన కార్పొరేట్ రుణాలు మంజూరై, వినియోగం కోసం వేచి ఉన్నాయి.
రిస్క్ ఫ్యాక్టర్స్: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ట్రేడ్ అనిశ్చితి, కమోడిటీ ధరల హెచ్చుతగ్గులు సవాళ్లుగా మారవచ్చని శెట్టి హెచ్చరించారు.