పదవీ విరమణ తర్వాత చేతికి వచ్చిన పొదుపు సొమ్ముపై క్రమం తప్పకుండా, అంచనాకు తగినట్లు రాబడి పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) అనేది మొదటి, అత్యంత సురక్షితమైన ఆప్షన్‌గా కనిపిస్తుంటుంది. అలాంటి ఎఫ్‌డీల్లో వడ్డీ రేటు అనేది చాలా కీలకం. అయితే బ్యాంకులను బట్టి ఈ వడ్డీ రేట్లలో పెద్ద తేడా కనిపిస్తోంది. పెద్ద ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధారణంగా ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. 2026 నవంబర్ 25 నాటి పైసాబజార్ డేటా ప్రకారం.. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఎఫ్డీపై అత్యధికంగా 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో డీసీబీ బ్యాంక్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెరో 8 శాతం వడ్డీతో నిలిచాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీ..

ఐదేళ్ల ఎఫ్డీ వడ్డీ రేట్ల పట్టికలో పైస్థానాలను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆక్రమించాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.5 శాతం ఇవ్వగా, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం వడ్డీ అందిస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.7 శాతం వడ్డీ ఇస్తోంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెరో 7.5 శాతం వడ్డీ రేటును ప్రకటించాయి.
| సోర్సు: పైసాబజార్, నవంబర్ 25 2026 డేటా |
ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ బ్యాంకుల ఎఫ్డీ వడ్డీ రేట్లు..
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో డీసీబీ బ్యాంక్ 8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఎస్బీఎం బ్యాంక్ ఇండియా, యస్ బ్యాంక్ చెరో 7.5 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.35 శాతం వడ్డీ ఇస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ ఐదేళ్ల డిపాజిట్లపై 7.2 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
{{/usCountry}}ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో డీసీబీ బ్యాంక్ 8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఎస్బీఎం బ్యాంక్ ఇండియా, యస్ బ్యాంక్ చెరో 7.5 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.35 శాతం వడ్డీ ఇస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ ఐదేళ్ల డిపాజిట్లపై 7.2 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
{{/usCountry}}| సోర్సు- పైసాబజార్, నవంబర్ 25 2026 డేటా |
ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ 7.05 శాతంతో ముందుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.9 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 6.85 శాతం వడ్డీ అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ చెరో 6.75 శాతం వడ్డీ ఇస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 6.75 శాతం, డ్యూయిష్ బ్యాంక్ 6.25 శాతం, హెచ్ఎస్బీసీ 6 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.
| సోర్సు- పైసాబజార్, నవంబర్ 25 2026 డేటా |
ఎక్కువ వడ్డీ వెంట పడాలా? డిపాజిట్ బీమా, నిబంధనలేంటి?
ఎక్కువ వడ్డీ రేటు రిటైర్మెంట్ పొదుపుపై రాబడిని పెంచినా, ప్రకటనల్లో కనిపించే వడ్డీని చూసి మాత్రమే బ్యాంకును ఎంచుకోకూడదు. డిపాజిట్ బీమా ఇందులో కీలకం. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నిబంధన ప్రకారం.. ఒక్కో బ్యాంకులో ఒక్కో డిపాజిటర్‌కు అసలు, వచ్చిన వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. ఒకే బ్యాంకులోని వేర్వేరు బ్రాంచ్‌లలో ఉన్న డిపాజిట్లను కలిపి ఈ పరిమితిని లెక్కిస్తారు.
అందువల్ల ఒకే బ్యాంకులో రూ. 5 లక్షలకు మించి డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లు, ఆపై మొత్తానికి బీమా రక్షణ ఉండదని గుర్తుంచుకోవాలి. వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు పెడితే వర్తించే నిబంధనలకు లోబడి వేర్వేరుగా బీమా కవరేజీ లభిస్తుంది. గడువు తీరకముందే నగదు తీసుకునే (ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్) నిబంధనలను కూడా పరిశీలించాలి! ముందుగా డబ్బు తీసుకుంటే తక్కువ వడ్డీ లేదా జరిమానా పడే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీ వడ్డీపై పన్నులు ఎలా?
బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే వడ్డీకి డిపాజిటర్ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది. అందువల్ల పన్ను తర్వాత చేతికి వచ్చే నికర రాబడి, ప్రకటించిన వడ్డీ రేటు కంటే తక్కువగా ఉండవచ్చు.
వడ్డీ ఆదాయం నిర్ణీత పరిమితి దాటినప్పుడు బ్యాంకులు టీడీఎస్ కోత విధిస్తాయి. పన్ను బాధ్యత సున్నాగా ఉండే అర్హులైన సీనియర్ సిటిజన్లు, టీడీఎస్ మినహాయింపు కోసం ఫారం 121 సమర్పించవచ్చు. మొత్తంగా ఐదేళ్ల ఎఫ్డీలో సొమ్ము పెట్టే ముందు పన్ను తర్వాత వచ్చే రాబడి, బీమా పరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలను పోల్చి చూసుకోవడం ఎప్పుడూ మంచిది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.