...
...
Next Story

విద్యార్థుల ఇన్నోవేటివ్ ఐడియాలకు రూ. 10 లక్షల నజరానా! సేవా ఫస్ట్ ఛాలెంజ్ వివరాలు..

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026' దరఖాస్తు గడువును నవంబర్ 6 వరకు పొడిగించారు. బహుమతి నిధులు, దరఖాస్తు విధానం. అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.య

Published on: Nov 3, 2026, 06:46:09 IST
Advertisement

పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి పీహెచ్​డీ స్టూడెంట్స్ వరకు.. వారిలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను, పరిశోధనా పటిమను వెలికితీసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన 'సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (ఎస్​ఎఫ్​ఐసీ) 2026' రిజిస్ట్రేషన్ గడువు పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల ఇన్నోవేటివ్ ఐడియాలకు రూ. 10 లక్షల నజరానా!
విద్యార్థుల ఇన్నోవేటివ్ ఐడియాలకు రూ. 10 లక్షల నజరానా!

విద్యార్థులు తమ ఇన్నోవేటివ్ ఐడియాలను సమర్పించడానికి, పాఠశాలలు, కళాశాలలు వారి పేర్లను నామినేట్ చేయడానికి నామినేషన్ గడువును 2026 నవంబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ప్రసిద్ధ ఐఐఎస్సీ బెంగళూరు ప్రాంగణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ), మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు (అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి) చెందిన విద్యాసంస్థల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశంగా నిలవనుంది.

ఎవరెవరు అప్లై చేయవచ్చు? (3 ప్రధాన విభాగాలు)..

విద్యార్థుల వయోపరిమితి, విద్యా అర్హత ఆధారంగా ఈ సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్​ని మూడు విభాగాలుగా విభజించారు:

జూనియర్ విభాగం: 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ స్థానిక ప్రాంత సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. వర్కింగ్ ప్రొటోటైప్ (ఉత్పత్తి నమూనా) ఉంటే మంచిది, కానీ అది తప్పనిసరి కాదు.

టెక్నికల్ విభాగం: ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను సమర్పించవచ్చు.

ఈ సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో విద్యార్థులు స్వయంగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. సంబంధిత పాఠశాల లేదా కళాశాల యాజమాన్యమే అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  • ముందుగా అధికారిక పోర్టల్ (https://sevafirst.mic.gov.in/) ని సందర్శించాలి.
  • ఇన్​స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకుని, UDISE లేదా AISHE కోడ్ ద్వారా వివరాలను నమోదు చేయాలి.
  • నియమించిన కోఆర్డినేటర్ వివరాలు అందించి, ఈమెయిల్‌కు వచ్చే 8 అంకెల పాస్‌వర్డ్ ద్వారా అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి.
  • అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత కోఆర్డినేటర్ విద్యార్థుల ప్రాజెక్ట్‌లను సబ్‌మిట్ చేయవచ్చు.

ఐదు ముఖ్యమైన ఇన్నోవేషన్ థీమ్స్, రూ. 10 లక్షల బహుమతి..

సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోటీదారులు స్వచ్ఛ భారత్, రైతు సంక్షేమం, ఆరోగ్య భారత్, నైపుణ్యాభివృద్ధి, సురక్షిత భారత్ అనే 5 అంశాలపై తమ ప్రాజెక్టులు అందించాలి. ప్రతి థీమ్‌లో గెలుపొందిన ఇన్నోవేటర్లకు కింది బహుమతులు లభిస్తాయి:

  • ప్రథమ బహుమతి: రూ. 10 లక్షలు
  • ద్వితీయ బహుమతి: రూ. 5 లక్షలు
  • తృతీయ బహుమతి: రూ. 3 లక్షలు

ఎంపికైన విద్యార్థులకు నిపుణుల మార్గదర్శకత్వం, ఐఐఎస్సీ సైన్స్ ల్యాబ్‌లు, నిధుల సహాయం, స్టార్టప్ మార్గదర్శకత్వం కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ముగింపు తేదీ..

సమర్పించిన ఇన్నోవేషన్ల ప్రామాణికత, నాణ్యత, అయ్యే ఖర్చు, సమాజానికి ఉపయోగపడే విలువల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తుంది ఎన్‌ఐటీలు , ఐఐఎస్సీ బెంగళూరు నిపుణుల బృందం.

నవంబర్ 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల గడువు సవరించినందున మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచిస్తోంది. ఏదైనా సందేహాలుంటే అధికారిక పోర్టల్లో రోజూ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు జరిగే ఆన్‌లైన్ ఓరియంటేషన్ సెషన్లలో పాల్గొనవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks