తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు
తమిళనాడులో ఘరో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెుత్తం 11 మంది మరణించారు. చాలా మందికి గాయాలు అయ్యాయి.
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక బస్సు కరైకుడి వైపు వెళుతుండగా, మరొకటి మధురై వైపు వెళుతుండగా తిరుపత్తూరు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఘరో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు బస్సుల్లో చిక్కుకుపోయారని, స్థానికులు, అత్యవసర బృందాలు వారిని బయటకు తీశాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొనడంతో 11 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.
కారైకుడికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి సహా 11 మంది అక్కడికక్కడే మృతి చెందారని జిల్లా పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అధికారులు మాట్లాడారు. 'ఇది ముఖాముఖి ఢీకొనడం కారణమా అని స్పష్టంగా తెలియదు. మేం దానిని పరిశీలిస్తున్నాం.' అని చెప్పారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అదికారులు తెలిపారు. ఇందులో కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు.
ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు మెుదలైంది. ఎమర్జెన్సీ సేవలు కోసం పలు బృందాలు సంఘటన స్థలంలోనే ఉన్నాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


