...
...
Next Story

IPL 2026: తెలుగు కుర్రాడి ఆల్‌రౌండ్ షో.. స‌న్‌రైజ‌ర్స్ అదుర్స్‌.. ప‌వ‌ర్ ప్లే రికార్డు.. కేకేఆర్ చిత్తు

IPL 2026: ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫస్ట్ విక్టరీ అందుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. దీంతో కేకేఆర్ ను స‌న్‌రైజ‌ర్స్ చిత్తు చేసింది. అంతే కాకుండా బ్యాటింగ్ లో ఓ రికార్డు కూడా క్రియేట్ చేసింది.

Published on: Apr 3, 2026, 06:18:26 IST
Advertisement

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. గురువారం (ఏప్రిల్ 2) రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఐపీఎల్ 2026లో టీమ్ కు ఫస్ట్ విక్టరీని అందించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్

నితీశ్ కుమార్ రెడ్డి (PTI)
నితీశ్ కుమార్ రెడ్డి (PTI)

విధ్వంసకర బ్యాటర్లతో నిండి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. కేకేఆర్ పై పిడుగులా పడింది. ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది.

పవర్ ప్లే రికార్డు

సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడారు. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించారు. దీంతో టీమ్ 6 ఓవర్లలోనే 84 పరుగులు సాధించారు. ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో పవర్ ప్లేలో ఓ టీమ్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు, ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు.

ఛేజింగ్ లో ఇలా

ఫస్ట్ బ్యాటింగ్ లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత బౌలింగ్ లోనూ సత్తాచాటింది. నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు జైదేవ్ ఉనద్కత్ (3 వికెట్లు), ఈశాన్ మలింగ (2 వికెట్లు) కూడా రాణించారు.

వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ తో మరోసారి తన ఆల్ రౌండ్ టాలెంట్ ను బయటపెట్టాడు. ఈ పేస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సత్తాచాటాడు. ఫస్ట్ బ్యాటింగ్ లో 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.

ఆ తర్వాత బౌలింగ్ లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. కీలకమైన రింకు సింగ్ వికెట్ సాధించాడు. బ్యాటింగ్ లో ధనాధన్ షాట్లు ఆడటంతో పాటు బౌలింగ్ లోనూ జట్టుకు వికెట్లు అందించడం నితీశ్ కుమార్ ప్రత్యేకత. అందుకే అతనికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks