SSC Stenographer 2026 : నెలకు రూ. 1.4లక్షల వరకు జీతంతో ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ ఉద్యోగం- పూర్తి వివరాలు..

SSC stenographer grade c & d : నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్! ఎస్​ఎస్సీ చేపట్టిన స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇంకొన్ని రోజులే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 3, 2026, 09:08:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SSC Stenographer Salary : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు అలర్ట్​! 2026 సంవత్సరానికి గాను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సీ', గ్రేడ్ 'డీ' పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ) చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026..
ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026..

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 24 నుంచి మే 15, 2026 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఎస్సీ అధికారులు సూచిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 731 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు, వయోపరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం అకాడమిక్ అర్హత ఉంటే సరిపోదు, స్టెనోగ్రఫీలో నైపుణ్యం తప్పనిసరి.

గ్రేడ్ సీ : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రేడ్ డీ : వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

(వయోపరిమితిని ఆగస్టు 1, 2026 ప్రాతిపదికన లెక్కిస్తారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం..

స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షను జులై లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది.

రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి కీలకమైన 'స్కిల్ టెస్ట్' నిర్వహిస్తారు.

గ్రేడ్ సీ కోసం నిమిషానికి 100 పదాల వేగంతో స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది.

గ్రేడ్ డీ కోసం నిమిషానికి 80 పదాల వేగం అవసరం.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్కిల్ టెస్ట్ అనేది కేవలం అర్హత పరీక్ష (క్వాలిఫయింగ్) మాత్రమే. మెరిట్ జాబితాను రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే రూపొందిస్తారు.

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026- వేతనం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జీతంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

గ్రేడ్ సీ: పే లెవల్ 7 కింద రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు వేతనం ఉంటుంది.

గ్రేడ్ డీ: పే లెవల్ 4 కింద రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు వేతనం లభిస్తుంది.

వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ అలొవెన్సులు, పెన్షన్ సౌకర్యాలు కూడా అందుతాయి.

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.

అభ్యర్థులు ఎస్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొదట వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేయాలి. ఆ తర్వాత తమ ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More