2026 అడుగు దూరంలో ఉంది. అదే సమయంలో 2025 చివరి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో 2026 స్టాక్ మార్కెట్ సెలవుల గురించి తెలుసుకోవాలని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చూస్తుంటారు. అందుకే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎంసీఎక్స్కి సంబంధించిన 2026 ట్రేడింగ్ హాలీడే వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026లో స్టాక్ మార్కెట్ సెలవుల లిస్ట్..

అధికారిక క్యాలెండర్ ప్రకారం 2026లో దేశీయ స్టాక్ మార్కెట్ ఈ తేదీల్లో మూతపడి ఉంటుంది.
జనవరి 26 (సోమవారం)- రిపబ్లిక్ డే
మార్చ్ 3(మంగళవారం)- హోలీ
మార్చ్ 26 (గురువారం)- శ్రీ రామ నవమి
మార్చ్ 31 (మంగళవారం)- శ్రీ మహావీర్ జయంతి
ఏప్రిల్ 3 (శుక్రవారం)- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 (మంగళవారం)- డా బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి
మే 1 (శుక్రవారం)- మహారాష్ట్ర డే
మే 28 (గురువారం)- బక్రీద్
జూన్ 26 (శుక్రవారం)- మొహర్రం
సెప్టెంబర్ 14 (సోమవారం)- వినాయక చవితి
- 2026లో ‘లాంగ్ వీకెండ్’ జాతర- దాదాపు ప్రతి నెలలో వరుస సెలవులు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అక్టోబర్ 2 (శుక్రవారం)- మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 20 (మంగళవారం)- దసరా
నవంబర్ 10 (మంగళవారం)- దీపావళి
నవంబర్ 24 (మంగళవారం- గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (శుక్రవారం)- క్రిస్మస్
అంటే 2026లో స్టాక్ మార్కెట్కు 15 రోజుల ప్రత్యేక, పండుగ సెలవులు ఉన్నాయి. ఆయా తేదీల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, కమొడిటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.
{{/usCountry}}అంటే 2026లో స్టాక్ మార్కెట్కు 15 రోజుల ప్రత్యేక, పండుగ సెలవులు ఉన్నాయి. ఆయా తేదీల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, కమొడిటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.
{{/usCountry}}వీటితో పాటు ప్రతి శని, ఆదివారాలు (సెబీ నోటిఫికేషన్లు మినహా) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు హాలీడే ఉంటుంది. మహాశివరాత్రి, స్వాతంత్ర్య దినోత్సవం వంటి కొన్ని ప్రత్యేక, పండుగ సెలవులు సైతం ఈసారి శని, ఆదివారాల్లో వచ్చాయి.
వీటికి అదనంగా, సెటిల్మెంట్ హాలీడేల వివరాలు కూడా స్టాక్ మార్కెట్ క్యాలెండర్లో పొందుపరిచారు. సెటిల్మెంట్ హాలీడే రోజున మార్కెట్లు ఓపెన్లో ఉండొచ్చు, కానీ క్లియరింగ్, సెటిల్మెంట్ కార్యకలాపాలు మూతపడి ఉంటాయి. ఇది ఫండ్ ట్రాన్స్ఫర్స్, సెక్యురిటీ క్రెడిట్ వంటి వాటిని ప్రభావితం చేస్తుంది.
ఫిబ్రవరి 19, ఏప్రిల్ 1, ఆగస్ట్ 27న సెటిల్మెంట్ హాలీడేలు ఉంటాయని మదుపర్లు, ట్రేడర్లు గుర్తుపెట్టుకోవాలి.
స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్ అందుబాటులో పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రేడ్ ఎగ్జిట్, ఎంట్రీ వంటి కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఇలా..
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నిఫ్టీ50 28 పాయింట్ల లాభంలో 25,971 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 84,793 వద్ద కొనసాగుతోంది.