ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1690 పాయింట్లు పడి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 487 పాయింట్లు కోల్పోయి 22,820 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1433 పాయింట్లు పడి 52,275 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ.4,367.30 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,566.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐల విక్రయాలు రూ. 1లక్ష కోట్లు దాటేశాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎఫ్ఐఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేయడం ఇదే మొదటిసారి!
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 261 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 22,450 లెవల్స్ కన్నా దిగువకు పడితే మరింత వీక్నెస్ కనిపించవచ్చు. 22,000 దగ్గర సపోర్ట్ ఉంది. 23,200 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.73 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.67శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కాస్పీ 3.9శాతం మేర నష్టపోయయి.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కాస్పీ 3.9శాతం మేర నష్టపోయయి.
{{/usCountry}}Mutual funds : ఇక మ్యూచువల్ ఫండ్స్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు! సెబీ 'గిఫ్ట్ కార్డ్' రూల్స్ ఇవే..
చమురు ధరలు..
ఇరాన్ యుద్ధం అనిశ్చితి వేళ ముడి చమురు ధరలు సోమవారం మరింత పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 3.10శాతం పెరిగి బ్యారెల్‌కి 116.06 డాలర్లకు చేరింది.
చమురు ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లకు అస్సలు మంచి విషయం కాదు.
స్టాక్స్ టు బై..
ఓఎన్జీసీ- బై రూ. 281.95, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 297
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్- బై రూ. 668, స్టాప్ లాస్ రూ. 654, టార్గెట్ రూ. 700
నాల్కో- బై రూ. 371, స్టాప్ లాస్ రూ. 363, టార్గెట్ రూ. 390