...
...
Next Story

Study Abroad : అతి తక్కువ ఖర్చుతో విదేశీ విద్య- భారతీయులకు ఉన్న ఆప్షన్స్​ ఇవి..

Study Abroad 2026 : విదేశాల్లో చదువుకోవాలనేది ఎంతోమంది భారతీయ విద్యార్థుల కల. కానీ, కోట్లాది రూపాయల ఖర్చవుతుందని భయపడి వెనకడుగు వేస్తుంటారు. అయితే, సరైన ప్రణాళిక ఉంటే ఏడాదికి రూ. 5-10 లక్షల బడ్జెట్‌తోనే నాణ్యమైన అంతర్జాతీయ విద్యను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆప్షన్స్ ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 8, 2026, 06:48:07 IST
Advertisement

Low Cost International Education : విదేశాల్లో చదువుకోవాలని, మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని సంపాదించాలని చాలా మంది భారతీయులు కలలు కంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. అయితే, కొందరు మాత్రం బడ్జెట్​ లేక ఆగిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఈ 2026లో విదేశీ విద్యను అఫార్డిబుల్​గా అందించే కొన్ని దేశాల వివరాలను ఇక్కడ చూద్దాము. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, మలేషియా వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా, జీవన వ్యయం కూడా తక్కువగా ఉండి, ఏడాదికి రూ. 10లక్షల బడ్జెట్​తో విదేశాల్లో చదువుకునే ఆప్షన్స్​ ఇవి..

‘జర్మనీ’ కేరాఫ్ అడ్రస్..

విదేశాల్లో చదువు- భారతీయులకు అఫార్డిబుల్​ ఆప్షన్స్​ ఇవి..
విదేశాల్లో చదువు- భారతీయులకు అఫార్డిబుల్​ ఆప్షన్స్​ ఇవి..

తక్కువ ఖర్చుతో విదేశీ విద్యను కోరుకునే వారికి జర్మనీ మొదటి ప్రాధాన్యత అనే చెప్పుకోవాలి. ఇక్కడి పబ్లిక్ యూనివర్సిటీలలో దాదాపు ‘సున్నా’ ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే మీరు చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు (కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీజులు మినహా). అయితే, ఇక్కడ జీవన వ్యయం ఏడాదికి రూ. 8 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉండవచ్చు. దీనిని అధిగమించడానికి పార్ట్-టైమ్ ఉద్యోగాలు ఎంతగానో దోహదపడతాయి.

ఇటలీ, మలేషియాలలో తక్కువ ఖర్చుతోనే..

ఇటలీ: ఇక్కడి ప్రభుత్వ యూనివర్సిటీలలో కోర్సు ఫీజులు ఏడాదికి రూ. 90,000 నుంచే ప్రారంభమవుతాయి. దీనికి తోడు 'డీఎస్​యూ' వంటి స్కాలర్‌షిప్‌లు సాధిస్తే చదువు మరింత సులభమవుతుంది.

మలేషియా: ఆసియా ఖండంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించే దేశాల్లో మలేషియా ఒకటి! ఇక్కడ ట్యూషన్ ఫీజు, వసతి అన్నీ కలిపి ఏడాదికి రూ. 5 నుంచి 9 లక్షల లోపే పూర్తవుతాయి. భారత్‌కు దగ్గరగా ఉండటం కూడా ఇక్కడ అదనపు ప్రయోజనం.

నార్డిక్ దేశాలు.. స్కాలర్‌షిప్‌లే ఆధారం

నార్వే, స్వీడెన్, డెన్మార్క్ వంటి దేశాల్లో జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి, తదనుగుణంగానే ఖర్చులు కూడా ఉంటాయి. కానీ, ఇక్కడి యూనివర్సిటీలు అందించే వివిధ రకాల స్కాలర్‌షిప్‌ల ద్వారా భారతీయ విద్యార్థులు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.

విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయాలు..

1. విదేశాల్లో చదువుకోవడానికి కనీసం ఎంత బడ్జెట్ ఉండాలి?

జర్మనీ లేదా మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటే, ఏడాదికి రూ. 5 నుంచి 10 లక్షల బడ్జెట్‌తో నాణ్యమైన విద్యను పొందవచ్చు.

2. జర్మనీలో ట్యూషన్ ఫీజు నిజంగా ఉచితమా?

అవును, జర్మనీలోని మెజారిటీ పబ్లిక్ యూనివర్సిటీలలో ట్యూషన్ ఫీజు ఉండదు. విద్యార్థులు కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీజులు, వారి జీవన వ్యయాలను మాత్రమే భరించాల్సి ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks