...
...
Next Story

Ind vs Eng: ఆ ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌తో జాగ్ర‌త్త‌-శాంస‌న్‌ను ప‌డ‌గొట్ట‌గ‌ల‌డు-సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

Ind vs Eng: టీ20 ప్రపంచకప్ సెమీస్ లో బలమైన ఇంగ్లాండ్ ను టీమిండియా ఢీ కొట్టబోతుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఇండియాను దిగ్గజం సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. ఓ ఇంగ్లాండ్ ఆటగాడితో జాగ్రత్త అని సూచించాడు.

Published on: Mar 3, 2026, 13:03:37 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో కఠిన సవాలుకు సిద్ధమవుతోంది. సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఢీ కొట్టబోతుంది. మార్చి 5న వాంఖడేలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఈ సెమీస్ నేపథ్యంలో ఇండియా ఆల్ రౌండర్ విల్ జాక్స్ తో జాగ్రత్త అంటూ టీమిండియాకు సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు.

సునీల్ గవాస్కర్ వార్నింగ్

ఇండియాకు సునీల్ గవాస్కర్ వార్నింగ్
ఇండియాకు సునీల్ గవాస్కర్ వార్నింగ్

ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ ముందు ఇండియాకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ తో జాగ్రత్త అని గవాస్కర్ సూచించాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో విల్ జాక్స్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఏడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లతో పాటు, ఒక హాఫ్ సెంచరీతో సహా 191 పరుగులు చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక, ఇటలీ, నేపాల్ పై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

శాంసన్ కు బ్రేక్

సూపర్ 8లో వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియాను సంజు శాంసన్ గెలిపించాడు. అయితే సెమీస్ లో శాంసన్ కు ఆఫ్ స్పిన్నర్ అయిన విల్ జాక్స్ బ్రేక్ వేసే అవకాశముందని గవాస్కర్ అన్నాడు. శాంసన్ ను జాక్స్ పడగొట్టగలడని అభిప్రాయపడ్డాడు.

చాలా ప్లస్

‘‘కొంచెం టర్న్ ఉంటే అతను (విల్ జాక్స్) ఇబ్బంది పెట్టగలడు. శాంసన్, సూర్యకుమార్ యాదవ్ లేదా హార్దిక్ పాండ్యా అతన్ని ఎలా ఎదుర్కొంటారనేది కీలకం. అతను మంచి ఫామ్ లో ఉన్నాడు. నంబర్ 7 వద్ద అలాంటి ఆటగాడు ఉండటం ఇంగ్లాండ్ కు చాలా ప్లస్. మనకు శివమ్ దూబే ఉన్నాట్లే ఇంగ్లాండ్ కు విల్ జాక్స్’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.

ఇండియానే ఫేవరెట్

వాంఖడేలోనే జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రౌండ్ లో ఆడిన మిగతా మూడు ప్రపంచకప్ సెమీస్ ల్లో భారత్ రెండు ఓడిపోయింది. 1987లో ఇంగ్లాండ్ చేతిలో, 2016లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే గతంతో ఇప్పుడు సంబంధం లేదని సన్నీ అన్నాడు. "ఇది ఒక కొత్త శకం. ఒక కొత్త జట్టు. భారత జట్టుకు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ వరకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా" అని గవాస్కర్ ముగించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks