SUVs under 15 Lakhs : రూ. 15లక్షల ధరలోపు టాప్ 5 ఎస్‌యూవీలు- కళ్లు మూసుకుని కొనేయొచ్చు!
Cars under 15 lakhs : మీరు కొత్త ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లో ఉన్న ఆప్షన్లు చూసి, ఏది ఎంచుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే. రూ. 15లక్షల ధరలోపు ఈ 2026లో లభిస్తున్న బెస్ట్, టాప్- 5 ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు మొగ్గు చూపిన వినియోగదారులు.. ఇప్పుడు పవర్‌ఫుల్ లుక్, సెక్యూరిటీ కోసం ఎస్‌యూవీలనే ఇష్టపడుతున్నారు. కంపెనీలు కూడా పోటీపడి మరీ కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.

మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మార్కెట్ నమ్మకం, సేఫ్టీ రేటింగ్స్, పర్ఫార్మెన్స్ ఆధారంగా రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ఈ 2026లో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
1. మారుతీ సుజుకీ బ్రెజ్జా (జెడ్ఎక్స్ఐ వేరియంట్)..
విశ్వసనీయతకు, రీసేల్ వాల్యూకు మారుతీ సుజుకీ పెట్టింది పేరు. బ్రెజ్జా ఎస్‌యూవీ ఈ విభాగంలో తిరుగులేని రాజుగా కొనసాగుతోంది.
ఎందుకు కొనాలి: తక్కువ మెయింటెనెన్స్, నమ్మకమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్.
ప్రత్యేకత: దీనికి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. అలాగే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
మా సలహా: ఫీచర్లు, ధరను బట్టి 'జెడ్ఎక్స్ఐ' ట్రిమ్ బెస్ట్ ఛాయిస్.
2. టాటా నెక్సాన్ (క్రియేటివ్/ ఫియర్లెస్ వేరియంట్లు)..
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. సేఫ్టీ విషయంలో దీనికి సాటిలేదు.
ఎందుకు కొనాలి: గట్టి బాడీ స్ట్రక్చర్, ప్రీమియం ఫీచర్లు.
ప్రత్యేకత: గత దశాబ్ద కాలంగా ఎస్‌యూవీ సేల్స్ చార్టులో ఇది టాప్ 5లో ఉంటోంది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే హై-సేఫ్టీ కార్ ఇది.
మా సలహా: ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు 'క్రియేటివ్' లేదా 'ఫియర్లెస్' మోడళ్లను ఎంచుకోవచ్చు.
3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (ఏఎక్స్5 వేరియంట్)..
మహీంద్రా తన ఎస్‌యూవీలను కొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా మారింది.
ఎందుకు కొనాలి: డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి పవర్ (1.2-లీటర్ టర్బో పెట్రోల్) కావాలనుకునే వారికి ఇది బెస్ట్.
ప్రత్యేకత: ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, అడాస్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
మా సలహా: వాల్యూ ఫర్ మనీ కోరుకునే వారు 'ఏఎక్స్5' వేరియంట్ వైపు వెళ్లొచ్చు.
4. కియా సోనెట్ (హెచ్‌టీఎక్స్/ జీటీఎక్స్ వేరియంట్లు)..
తక్కువ ధరలో విలాసవంతమైన ఫీచర్లు కావాలనుకునే యువతకు కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ ఛాయిస్ అవుతోంది!
ఎందుకు కొనాలి: ప్రీమియం లుక్, అదిరిపోయే ఇంటీరియర్స్.
ప్రత్యేకత: బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ కార్లలో ఉండే ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
మా సలహా: బడ్జెట్‌ను బట్టి 'హెచ్‌టీఎక్స్' లేదా స్పోర్టీ లుక్ కోసం 'జీటీఎక్స్' వేరియంట్ ఎంచుకోండి.
5. హోండా ఎలివేట్ (ఎస్వీ/ వీ వేరియంట్లు)..
"నో-నాన్సెన్స్" ఎస్‌యూవీగా పేరుగాంచిన హోండా ఎలివేట్, సిటీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ ట్రిప్పులకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
ఎందుకు కొనాలి: విశాలమైన క్యాబిన్, భారీ మస్కులర్ డిజైన్.
ప్రత్యేకత: హోండా నమ్మకమైన 1.5-లీటర్ ఐ-వీటెక్ ఇంజిన్ దీని సొంతం. ఇది హైవేలపై చాలా స్మూత్‌గా సాగుతుంది.
మా సలహా: 'ఎస్వీ' లేదా 'వీ' వేరియంట్లు బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను అందిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ఈ ఐదింటిలో మైలేజ్ పరంగా ఏది బెస్ట్?
మీరు మైలేజ్, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని అనుకుంటే, మారుతీ సుజుకీ బ్రెజ్జా (సీఎన్జీ వేరియంట్) ఉత్తమమైనది.
2. సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తే ఏ కారు కొనాలి?
సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలు ముందంజలో ఉన్నాయి. ఇవి గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్స్‌లో మంచి స్కోర్లు సాధించాయి.
3. ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ వెళ్లడానికి ఏది కంఫర్టబుల్?
హోండా ఎలివేట్, టాటా నెక్సాన్ వాటి విశాలమైన ఇంటీరియర్- కంఫర్ట్ కారణంగా లాంగ్ జర్నీలకు చాలా బాగుంటాయి.
4. రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయా?
అవును, పైన పేర్కొన్న ఐదు మోడళ్లలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వేరియంట్‌ను బట్టి ధర మారుతుంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


