టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు - వాటి ఫీచర్లు, ధరలు..

2026 టాటా పంచ్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ధరలు, వాటి ఫీచర్లను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jan 14, 2026, 16:00:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మైక్రో, ఫ్యామిలీ ఎస్​యూవీగా దూసుకెళుతున్న టాటా పంచ్​ ఇప్పుడు సరికొత్త అవతారంలో మన ముందుకు వచ్చింది. మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 2026 టాటా పంచ్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 టాటా పంచ్​ ఇదిగో..
2026 టాటా పంచ్​ ఇదిగో..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు- వాటి ధరలు (ఎక్స్​షోరూం)..

వేరియంట్​రెవొట్రాన్​ పెట్రోల్​ ఎంటీ (రూ.లక్షలు)రెవొట్రాన్​ పెట్రోల్​ ఏఎంటీఐసీఎన్జీ ఎంటీఐసీఎన్జీ ఏఎంటీఐటర్బో ఎంటీ
Smart5.596.69
Pure6.497.49
Pure +6.997.547.998.54
Pure + S7.347.898.34
Adventure7.598.148.599.148.29
Adventure S7.948.949.49
Accomplished8.298.849.29
Accomplished + S8.999.5410.549.79

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు- వాటి ఫీచర్లు..

  1. టాటా పంచ్ స్మార్ట్ - ఎక్స్​షోరూం ధర రూ. 5.59 లక్షలు

ఇది బేస్ వేరియంట్. తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ ఎస్​యూవీ కావాలనుకునే వారి కోసం దీనిని రూపొందించారు.

కీలక ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్.

ప్రత్యేకత: భారత్ ఎన్​సీఏపీలో 5-స్టార్ రేటింగ్ సాధించిన కారు కావడంతో, 2026 టాటా పంచ్​ బేస్ మోడల్‌లో కూడా భద్రతకు ఎక్కడా రాజీ పడలేదు. సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ వంటి కనీస అవసరాలు ఇందులో ఉన్నాయి.

2. టాటా పంచ్ ప్యూర్ - ఎక్స్​షోరూం ధర రూ. 6.49 లక్షలు

కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపిక. స్మార్ట్ వేరియంట్‌కు అదనంగా ఇందులో కొన్ని సౌకర్యాలు పెరుగుతాయి.

ముఖ్య ఫీచర్లు: వెనుక ఏసీ వెంట్స్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్, నాలుగు పవర్ విండోస్, 4 స్పీకర్ల ఆడియో సెటప్.

3. టాటా పంచ్ ప్యూర్+ - ఎక్స్​షోరూం ధర రూ. 6.99 లక్షలు

టెక్నాలజీని ఇష్టపడే వారికి ఇక్కడి నుంచి అసలు మజా మొదలవుతుంది1

ముఖ్య ఫీచర్లు: హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్​ యాపిల్ కార్‌ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్.

4. టాటా పంచ్ ప్యూర్+ ఎస్ - ఎక్స్​షోరూం ధర రూ. 7.34 లక్షలు

తక్కువ ధరలోనే సన్‌రూఫ్​తో కూడిన ఎస్​యూవీ కావాలనుకునే వారు ఈ 2026 టాటా పంచ్​ ప్యూర్​+ వేరియంట్​ని ఎంచుకోవచ్చు. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు దీని సొంతం.

5. టాటా పంచ్ అడ్వెంచర్ - ఎక్స్​షోరూం ధర రూ. 7.59 లక్షలు

ఫీచర్ల పరంగా ఇది పక్కా 'ఆల్ రౌండర్' అని చెప్పుకోవాలి.

ముఖ్య ఫీచర్లు: 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్.

6. టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ - ఎక్స్​షోరూం ధర రూ. 7.94 లక్షలు

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ అడ్వెంచర్ వేరియంట్‌కు అదనంగా సన్‌రూఫ్, రూఫ్ రెయిల్స్ కావాలనుకునే వారి కోసం ఈ మోడల్.

7. టాటా పంచ్ అకాంప్లిష్డ్ - ఎక్స్​షోరూం ధర రూ. 8.29 లక్షలు

ఎస్​యూవీ అనేది ప్రీమియంగా ఉండాలనుకునే వారికి ఇది కరెక్ట్ ఛాయిస్.

ముఖ్య ఫీచర్లు: డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, అలాయ్ వీల్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్.

8. టాటా పంచ్ అకాంప్లిష్డ్+ ఎస్ - ఎక్స్​షోరూం ధర రూ. 8.99 లక్షలు

2026 టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో టాప్ ఎండ్ వేరియంట్. రాజీ పడకుండా అన్ని ఫీచర్లు కావాలనుకునే వారి కోసం.

ముఖ్య ఫీచర్లు: 16-ఇంచుల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, ప్రీమియం లెదర్ టచ్ ఇంటీరియర్స్.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​?

"కొత్త పంచ్ వేరియంట్లలో ‘అడ్వెంచర్’ ట్రిమ్ వాల్యూ ఫర్​ మనీ అని చెప్పవచ్చు. రూ. 7.59 లక్షల ధరలో 360-డిగ్రీ కెమెరా, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండటం అదనపు ఆకర్షణ" అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కేవలం భద్రత, బడ్జెట్ చూసుకునే వారికి 'ప్యూర్' వేరియంట్ సరిపోతుంది. నాకు అన్ని సౌకర్యాలు కావాలి అనుకుంటే 'అకాంప్లిష్డ్+ ఎస్' వైపు వెళ్లవచ్చు. మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి ఈ జాబితా నుంచి సరైన కారును ఎంచుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More