...
...
Next Story

New Electric cars : మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల జోరు- త్వరలో రానున్న టాప్-6 ఈవీలు ఇవే..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దేశీయ ఆటో దిగ్గజాల నుంచి రాబోయే ఏడాది కాలంలో ఆరు కొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి. వీటిల్లో టాటా సఫారీ ఈవీ, మహీంద్రా బీఈ 07 వంటి మోడల్స్​ ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Aug 17, 2026, 07:29:45 IST
Advertisement

టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ బ్రాండ్ల పుణ్యమా అని గత ఏడాది కాలంగా భారత కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ మోడళ్ల లాంచ్‌లు ఊపందుకున్నాయి. వచ్చే సంవత్సరాల్లో కూడా ఇదే జోరు కొనసాగనుంది. మరీ ముఖ్యంగా రాబోయే 12 నెలల్లోనే.. ఏకంగా ఆరు కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. ఎంజీ హెక్టార్ టామహాక్..

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..
మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..

చైనాకు చెందిన వూలింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా రూపొందిన కొత్త త్రీ-రో ఎస్‌యూవీ ఇది. దీనిని ఆగస్టు 26న ప్యూర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో, ఆ తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో 134 హెచ్‌పీ పవర్, 200 ఎన్ఎం టార్క్ అందించే ఫ్రంట్-మౌంటెడ్ పీఎంఎస్‌ఎం మోటార్ ఉంటుంది. అలాగే 56.7 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

2. కొత్త టాటా టిగోర్ఈవీ..

మచ్​ అవైటెడ్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఈ టిగోర్ ఈవీ ఒకటి. కొత్త టాటా టిగోర్ ఈవీలో మరింత ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్లు, మార్పులు చేసిన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్ ఉండనున్నాయి. మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, చూడటానికి మాత్రం నూతన తరం మోడల్‌లా కనిపిస్తుంది.

3. టాటా సఫారీ ఈవీ..

టాటా సఫారీ, టాటా ఆల్ట్రోజ్ మాత్రమే ప్రస్తుతం ఈవీ ఆప్షన్‌లో లేని ఆ బ్రాండ్ మోడళ్లు. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ లేదా ఎంజీ హెక్టార్ టామహాక్ ఈవీ తరహాలో పెద్ద ఫ్యామిలీ ఎస్‌యూవీ కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ టాటా మోటార్స్ త్వరలో సఫారీ ఎస్​యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. టాటా హారియర్​ఈవీ మాదిరిగానే స్టాండర్డ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ, లాంగ్-రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్లలో ఇది లభించనుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం.

4. హ్యుందాయ్ హెచ్‌ఈ1ఐ ఈవీ..

మారుతీ సుజుకీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 'వైఎంసీ' కోడ్ నేమ్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని లాంచ్ చేయనుంది. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ సెగ్మెంట్‌కు చెందిన ఎస్‌యూవీ స్టైల్ మోడల్ ఇది. ఈ విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే ఇది రూపుదిద్దుకోనుంది. అదే బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానున్న ఈ కారు సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

6. మహీంద్రా బీఈ 07..

బీఈ 6, ఎక్స్ఈవీ 9ఎస్ మధ్యలో వస్తున్న కొత్త ఫైవ్-సీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ బీఈ 07. టాటా హారియర్​ ఈవీతో ఇది పోటీ పడనుంది. ఇది సుమారు 4.6 మీటర్ల పొడవు, 1.9 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల ఎత్తుతో ఉండనుంది. మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ రేంజ్ కార్ల మాదిరిగానే స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో ఇది మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త సీ-ఎస్‌యూవీ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 650 కిలోమీటర్ల వరకు రేంజ్​ ఇచ్చే అవకాశం ఉంది.

మరి వీటిల్లో మీరు ఏ ఈవీ కొంటారు?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe