1990 దశకం నాటి బెస్ట్ సెల్లింగ్ మోడల్ టాటా సియెర్రాను రివైవ్ చేసి, టాటా మోటార్స్ ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక జనవరి 15 నుంచి ఈ ఎస్యూవీ డెలివరీలు మొదలవుతాయి. మరి మీరు కూడా టాటా సియెర్రా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. టాటా సియెర్రా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్- ఇదే వాల్యూ ఫర్ మనీ..

టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్ చూడటానికి ఎంతో బలంగా, గంభీరంగా కనిపిస్తుంది. పైన అమర్చిన సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ముందు వైపు ఒక చివరి నుంచి మరో చివరి వరకు సాగిపోయే ఎల్ఈడీ లైట్ బార్, పవర్‌ఫుల్ బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి. అయితే, బేస్ వేరియంట్‌కి నెక్ట్స్ ట్రిమ్ కావడంతో ఇందులో ఫాగ్ ల్యాంప్స్, అడాస్ కోసం వాడే ఫ్రంట్ రాడార్, పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉండవు.
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్- ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు..
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్ లోపల అడుగుపెడితే, టెక్నాలజీ పరంగా టాటా మోటార్స్ ఎక్కడా తగ్గలేదని అర్థమవుతుంది:
టచ్‌స్క్రీన్: 10.25 ఇంచ్ భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సదుపాయం ఉంది.
ఆడియో: ఎనిమిది స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.
వాయిస్ అసిస్ట్: ఆరు భాషల్లో 250కి పైగా వాయిస్ కమాండ్లను ఇది అర్థం చేసుకుంటుంది.
డిజిటల్ కాక్‌పిట్: డ్రైవర్ కోసం పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.
కన్వీనియన్స్: ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ ఫంక్షన్, టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి.
- టాటా సియెర్రా కొంటున్నారా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్- ఇంజిన్, పనితీరు..
సియెర్రా ఎస్యూవీ ప్యూర్ వేరియంట్‌లో కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా రెండు ఇంజిన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అవి..
{{/usCountry}}సియెర్రా ఎస్యూవీ ప్యూర్ వేరియంట్‌లో కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా రెండు ఇంజిన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అవి..
{{/usCountry}}పెట్రోల్: 1.5 లీటర్ ఇంజిన్ 106 పీఎస్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
డీజిల్: 1.5 లీటర్ ఇంజిన్ 118 పీఎస్ పవర్ ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లో 260 ఎన్ఎమ్, ఆటోమేటిక్ వేరియంట్‌లో 280 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తూ రోడ్లపై దూసుకుపోతుంది.
టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్- భద్రతలో రాజీ లేదు..
టాటా అంటేనే భద్రతకు మారుపేరు. ఇక ఈ టాటా సియెర్రా వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా ఇచ్చారు.
ఈ టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 12.99లక్షలుగా ఉంది.
మొత్తానికి, పాత జ్ఞాపకాలను ఆధునిక హంగులతో మేళవించిన టాటా సియెర్రా, తన అద్భుతమైన డిజైన్, ఫీచర్స్‌తో మధ్యతరగతి, ప్రీమియం వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.