ఇంకొన్ని రోజుల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాఘట్బంధన్' కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను ఖరారు చేశారు. ఈ కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ గురువారం జరిగిన 'ఇండియా' కూటమి సంయుక్త మీడియా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.
ఉద్రిక్తతల మధ్య గెహ్లాట్ జోక్యం..

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీట్ల పంపకాల విషయంలో “స్నేహపూర్వక పోటీ” పేరుతో కొన్ని స్థానాలపై కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో, కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌ను ఉద్రిక్తతలను చల్లార్చడానికి పిట్నాకు పంపింది.
ఏఐసీసీ ద్వారా సీనియర్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన గెహ్లాట్.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లను వారి నివాసంలో కలిశారు. ఆర్జేడీ అగ్ర నాయకత్వాన్ని కలిసిన తరువాత, కూటమి "పూర్తిగా ఐక్యంగా" ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
ఎన్నికలు ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు, సీట్ల పంపకాలపై కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్టు, కూటమిలో చీలికలు ఏర్పడినట్టు వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెహ్లాట్ ధృవీకరించారు.
తెజస్వి యాదవ్ వయస్సు 35ఏళ్లు. లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సు మీదపడటంతో పాటు పలు కేసుల్లో ఆయన చిక్కుకున్న అనంతరం, పార్టీ బాధ్యతలను తేజస్వి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఇండియా కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అంతకుముందు రోజు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నాయకుడు రామ్ నరేశ్ పాండే కూడా రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని, ఆయన రాష్ట్రానికి "భవిష్యత్ సీఎం" అవుతారని ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు - మహాఘటబంధన్ బలం..
2025 బిహార్ ఎన్నికల్లో ప్రధాన పోటీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), మహాఘటబంధన్ కూటముల మధ్యే ఉండనుంది. మహాఘటబంధన్‌లోని రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన సీట్లు సుమారు సుమారు 12 ఉన్నాయి.
{{/usCountry}}2025 బిహార్ ఎన్నికల్లో ప్రధాన పోటీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), మహాఘటబంధన్ కూటముల మధ్యే ఉండనుంది. మహాఘటబంధన్‌లోని రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన సీట్లు సుమారు సుమారు 12 ఉన్నాయి.
{{/usCountry}}మహాఘటబంధన్‌లో ఉన్న ప్రధాన పార్టీలు:
- రాష్ట్రీయ జనతాదళ్ (కూటమికి నేతృత్వం వహిస్తుంది)
- కాంగ్రెస్ పార్టీ
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- ముకేష్ సహాని నేతృత్వంలోని వికాశీల్ ఇన్సాన్ పార్టీ
అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ "స్నేహపూర్వక పోటీ" కారణంగా మహాఘటబంధన్ విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి విరుద్ధంగా, సీట్ల సర్దుబాటు ప్రకటించినప్పటికీ ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.
డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముకేశ్ సహాని..
కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ గురువారం ఉదయం మాట్లాడుతూ.. వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన, "కష్టపడి పనిచేసే" అధిపతి అయిన ముకేశ్ సహాని రాబోయే బిహార్ ఎన్నికలకు మహాఘటబంధన్ తరఫున ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని తెలిపారు.
44 ఏళ్ల సహాని, మల్లా, సహాని, నిషాద్ వర్గాల నుంచి ఓట్లను తీసుకురాగలరని భావిస్తున్నారు. ఈ వర్గాల ఓటింగ్ బలం సుమారు తొమ్మిది శాతం వరకు ఉండడం వల్ల బిహార్ ఎన్నికల పోరాటంలో బ్యాలెన్స్‌ను మార్చే అవకాశం ఉంది. నిషాద్ ఉపకులంగా పరిగణించే మల్లా కమ్యూనిటీ రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ, ముఖ్యంగా మిథిలాంచల్, సీమాంచల్ ప్రాంతాలలో వారికి ప్రభావం ఎక్కువ ఉంది. బిహార్‌లోని నదీతీర ప్రాంతాలలో ఉన్న చేపలు పట్టేవారి, పడవ నడిపేవారి వర్గాన్ని ఉద్దేశించి మల్లా, నిషాద్, సహాని పదాలను తరచుగా ఒకదానికొకటి బదులుగా లేదా ఉప-వర్గాలను సూచించడానికి ఉపయోగిస్తారు.
అయితే, సహాని ఒక్కరే ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోవచ్చని, ప్రతిపక్ష కూటమిలోని కీలక సభ్యుల ఆకాంక్షలను సంతృప్తి పరచడానికి మరికొందరి పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని గెహ్లాట్ తెలిపారు.
బిహార్లని 24 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 6, 11న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 14న వెలువడనున్నాయి.