Asian Games: వావ్.. అదుర్స్.. అద్భుతం.. ఆసియా క్రీడలు 2026లో తెలుగు అమ్మాయిల ప్రదర్శన పొగడటానికి ఈ మాటలు కూడా సరిపోవు. అవును.. మన తెలుగు రాష్ట్రాల ఆర్చర్లు ఏషియన్ గేమ్స్ 2026లో అదరగొట్టారు. ఒకే రోజు ఏకంగా రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. ఆ తెలుగు తేజాలే.. వెన్నం జ్యోతి సురేఖ, చికితా రావు.
ఆసియా క్రీడలు 2026

జపాన్ వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ కోసం ఇండియా గట్టిగా పోరాడుతోంది. ఎక్కువగా రజత పతకాలే రావడంతో దేశ ప్రజలు ఉసూరుమంటున్నారు. ఈ సమయంలో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు బంగారు పతకాలతో అదరగొట్టారు.
చికితా రావు రెండు గోల్డ్ మెడల్స్
ఆసియా క్రీడలు 2026లో తెలంగాణ అమ్మాయి చికితా రావు సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఒకే రోజు వెంటవెంటనే రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ మహిళల టీమ్, మిక్స్ డ్ టీమ్ విభాగాల్లో చికితా ఛాంపియన్ గా నిలింది.
ఒలింపిక్స్ బెర్త్
చికితా గోల్డ్ మెడల్స్ తో అదరగొట్టడమే కాదు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్త్ కూడా పట్టేసింది. ఆ ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీలో మిక్స్ డ్ టీమ్ విభాగంలో మాత్రమే పోటీలు పెట్టనున్నారు. ఇప్పుడు అదే విభాగంలో ఆసియా క్రీడల ఛాంపియన్ గా నిలిచిన చికితా-సాహిల్ జాదవ్ ఒలింపిక్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు.
ఉత్కంఠగా సాగిన కాంపౌండ్ ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగం ఫైనల్లో చికితా-సాహిల్ జాదవ్ 158-157 తేడాతో ఫాంగ్యో- జిన్ యి (చైనా)పై షూటాఫ్ లో విక్టరీ సాధించింది. అంతకుముందు సెమీస్ లో కూడా భారత జోడీ ఒక్క పాయింట్ తేడాతోనే థాయ్ లాండ్ ఆర్చర్లను ఓడించింది.
జ్యోతికి పసిడి
{{/usCountry}}ఉత్కంఠగా సాగిన కాంపౌండ్ ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగం ఫైనల్లో చికితా-సాహిల్ జాదవ్ 158-157 తేడాతో ఫాంగ్యో- జిన్ యి (చైనా)పై షూటాఫ్ లో విక్టరీ సాధించింది. అంతకుముందు సెమీస్ లో కూడా భారత జోడీ ఒక్క పాయింట్ తేడాతోనే థాయ్ లాండ్ ఆర్చర్లను ఓడించింది.
జ్యోతికి పసిడి
{{/usCountry}}మరోవైపు ఇండియాలో కాంపౌండ్ ఆర్చరీ అనగానే ముందుగా వినిపించేది జ్యోతి సురేఖ పేరే. ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అంతలా ఈ ఆటలో సత్తాచాటుతోంది. ఒలింపిక్స్ మినహా ఆమె పోటీపడని ఈవెంట్ లేదు, గెలవని పతకం లేదు. ఇప్పుడు ఆసియా క్రీడలు 2026లోనూ జ్యోతి మరోసారి మెరిసింది.
విమెన్ కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, చికితా, ప్రీతిక కలిసి 238-234 తేడాతో వునీర్, వాంగ్, ఫాంగ్యో (చైనా) త్రయాన్ని ఓడించారు. ప్రపంచ రికార్డును ఈక్వల్ చేస్తూ ఇండియాకు గోల్డ్ మెడల్ ను అందించారు.