భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి! ఇప్పుడు అందరి చూపు ఎస్‌యూవీల వైపు మళ్లుతోంది. పెద్ద కారు ఉండాలనే కోరిక పెరగడం వల్ల ఈ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే, సాధారణంగా ఎస్‌యూవీలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ, లగేజీ పెట్టుకునే స్థలం (బూట్ స్పేస్) విషయంలో తరచూ రాజీ పడాల్సి వస్తుంటుంది. కానీ, మీరు ఎక్కువ లగేజీతో, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం తరచూ ప్రయాణించే వారైతే.. 2026లో అత్యధిక బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తున్న ఈ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఖచ్చితంగా పరిశీలించాలి.
1. హోండా ఎలివేట్..

కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో లగేజీ స్పేస్ విషయంలో 'హోండా ఎలివేట్' రారాజు అని చెప్పవచ్చు. ఇది ఏకంగా 458 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తోంది.
ఇంజన్ అండ్ పవర్: ఇందులో 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 119.35 బీహెచ్పీ పవర్, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ సీవీటీ ఆప్షన్లలో లభిస్తుంది.
ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.59 లక్షలు.
2. టాటా సియెర్రా..
ఈ సెగ్మెంట్‌లో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన 'టాటా సియెర్రా' బూట్ స్పేస్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్శిల్ ట్రే ఉంటే 450 లీటర్లు, ఒకవేళ ట్రే తొలగిస్తే ఏకంగా 622 లీటర్ల స్థలం ఇందులో లభిస్తుంది.
ఇంజన్ ఆప్షన్లు: ఇందులో మూడు రకాల ఇంజన్లు ఉన్నాయి. 1.5లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ (103.56 బీహెచ్పీ), 1.5L టర్బోచార్జ్డ్ హైపెరియన్ పెట్రోల్ (157.81 బీహెచ్పీ), 1.5లీటర్ టర్బో డీజిల్ క్రయోజెట్ (116.39 బీహెచ్పీ).
ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.
ధర: ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు.
3. ఎంజీ ఆస్టర్..
{{/usCountry}}ధర: ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలు.
3. ఎంజీ ఆస్టర్..
{{/usCountry}}స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చే ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ.. 448 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
ఇంజన్ అండ్ పవర్: 1.5 లీటర్ వీటీఐ-టెక్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారు 108.5 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, 8-స్పీడ్ సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ధర: ఈ జాబితాలో అత్యంత తక్కువగా రూ. 9.65 లక్షల ప్రారంభ ధరతో ఇది లభిస్తుంది.
4. కియా సెల్టోస్..
ఫీచర్ల పరంగా దూసుకుపోయే కియా సెల్టోస్ 447 లీటర్ల బూట్ స్పేస్‌తో లగేజీకి తగినంత స్థలాన్ని కల్పిస్తోంది.
ఇంజన్ ఆప్షన్లు: ఇందులో 1.5ఎల్ పెట్రోల్, 1.5ఎల్ టర్బో పెట్రోల్, 1.5ఎల్ టర్బో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 157.57 బీహెచ్పీ పవర్‌ను ఇస్తుంది.
ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, ఐవీటీ, ఐఎంటీ, డీసీటీ, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్.. ఇలా అన్ని రకాల గేర్ బాక్స్ ఆప్షన్లు ఈ కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ఉన్నాయి.
ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలు.
5. హ్యుందాయ్ క్రెటా..
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా 433 లీటర్ల బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తోంది.
ఇంజన్ అండ్ పవర్: కియా సెల్టోస్ మాదిరిగానే ఇందులో కూడా మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు (1.5ఎల్ పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్) లభిస్తాయి.
ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.
ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.79 లక్షలు.