...
...
Next Story

బేస్ వేరియంట్​ అంటే చిన్న చూపు వద్దు! అదిరే ఫీచర్లు ఉన్న టాప్- 5 ఎస్‌యూవీలు ఇవి..

కొత్త కారు కొనేవారు సాధారణంగా మిడ్-వేరియంట్లను ఇష్టపడతారు. కానీ, కొన్ని మిడ్-సైజ్ ఎస్‌యూవీల బేస్ మోడల్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు! సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు బేస్ వేరియంట్​లలోనే అందిస్తున్న టాప్-5 ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Jan 31, 2026 04:02 PM IST
Advertisement

సాధారణంగా కొత్త కారు కొనేటప్పుడు చాలామంది బేస్ మోడల్స్ జోలికి వెళ్లరు. బేస్ వేరియంట్ అంటే కేవలం 'డబ్బా' మాత్రమే ఉంటుందని, ఏవైనా ఫీచర్లు కావాలంటే పై మోడల్ కొనుక్కోవాలనేది అందరిలో ఉండే అభిప్రాయం. కానీ ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పరిస్థితి మారింది! కొన్ని కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ వేరియంట్లలోనే యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బేస్ మోడల్‌లో అత్యధిక ఫీచర్లు ఇస్తున్న టాప్-5 ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఎస్​యూవీల బేస్​ వేరియంట్​లో​ అదిరే ఫీచర్లు..

  1. కియా సెల్టోస్ (హెచ్​టీఈ వేరియంట్)-

స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​లోనే సన్​రూఫ్​..
స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​లోనే సన్​రూఫ్​..

ఫీచర్ల పరంగా చూస్తే కియా సెల్టోస్ ఎస్​యూవీలోని 'హెచ్​టీఈ' వేరియంట్ ఈ జాబితాలో టాప్​లో నిలుస్తుంది. బేస్ మోడల్ అయినప్పటికీ ఇందులో 10.25 ఇంచ్​ భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండటం విశేషం. "బేస్ వేరియంట్లోనే క్రూయిజ్ కంట్రోల్ అందిస్తున్న ఏకైక ఎస్‌యూవీ ఇదే" అని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, రియర్ వ్యూ కెమెరా, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆరు స్పీకర్లు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే 1.5 లీటర్ పెట్రోల్ (115 హెచ్​పీ), 1.5 లీటర్ డీజిల్ (116 హెచ్​పీ) ఆప్షన్లలో లభిస్తుంది.

2. మారుతీ సుజుకీ విక్టోరిస్ (ఎల్​ఎక్స్​ఐ వేరియంట్)-

గ్రాండ్ విటారా కంటే మెరుగైన ఫీచర్లతో.. మారుతీ సుజుకీ విక్టోరిస్ బేస్ మోడల్ మార్కెట్​లోకి వచ్చింది. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్​ప్లే, వాయిస్ అసిస్టెంట్, ఓటీఏ అప్‌డేట్స్ వంటి టెక్నికల్ ఫీచర్లు ఉన్నాయి. రక్షణ పరంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉండటం వల్ల ఎంజీ ఆస్టర్ కంటే దీనికి మెరుగైన సేఫ్టీ ర్యాంకు దక్కింది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంది.

ఇటీవల ఫేస్‌లిఫ్ట్ పొందిన కుషాక్ బేస్ మోడల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బేస్ వేరియంట్​లోనే 'ఎలక్ట్రిక్ సన్‌రూఫ్' ఇస్తున్న ఏకైక కారు ఇదే. దీనితో పాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్ లాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మరో విశేషమేంటంటే.. ఈ లిస్ట్​లో ఎంట్రీ లెవల్ నుంచే 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇస్తున్న ఏకైక ఎస్‌యూవీ కూడా కుషాక్ కావడం గమనార్హం.

4. వోక్స్‌వ్యాగన్ టైగన్ (కంఫర్ట్​లైన్​ వేరియంట్)-

భద్రతకు పెద్దపీట వేసే వారు టైగన్ ఎస్​యూవీ బేస్ వేరియంట్​ను ఎంచుకోవచ్చు. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్‌సీ, టైర్ ప్రెజర్ వార్నింగ్ సిస్టమ్ వంటి అన్ని ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 7-ఇంచ్​ టచ్‌స్క్రీన్, ఆరు స్పీకర్లు, రియర్ ఏసీ వెంట్లను ఇందులో అందించారు. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

5. ఎంజీ ఆస్టర్ (స్ప్రింట్​ వేరియంట్)

రూ. 10 లక్షల లోపు ధరలోనే అత్యంత విలాసవంతమైన అనుభూతిని ఇచ్చే కారు ఈ ఎంజీ ఆస్టర్. దీని బేస్ వేరియంట్‌లో సాఫ్ట్-టచ్ లెదర్ డాష్‌బోర్డ్, 10.1 ఇంచ్​ పెద్ద టచ్‌స్క్రీన్ ఉన్నాయి. రియర్ ఆర్మ్‌రెస్ట్, ఎయిర్ ఫిల్టర్, మల్టిపుల్ స్టీరింగ్ మోడ్స్ ఉన్నప్పటికీ.. కేవలం రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉండటం దీని బలహీనత. అయినప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

మీరు కేవలం ఫీచర్ల కోసమే లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేసి టాప్ మోడల్ కొనాలని అనుకుంటే, ఒకసారి ఈ బేస్ వేరియంట్లను పరిశీలించండి. మీకు కావాల్సిన అన్ని ప్రధాన సౌకర్యాలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe