...
...
Next Story

Toyota new cars : టయోటా క్రేజీ ప్లాన్​- న్యూ జెన్​ ఫార్చ్యూనర్​తో పాటు ఈ కొత్త కార్లు లాంచ్..

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో టయోటా కిర్లోస్కర్ మోటార్ భారీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. మారుతీ సుజుకీ రీ-బ్యాడ్జ్ కార్లపై ఆధారపడటం తగ్గించి, సొంతంగా ఎస్‌యూవీ, ఎంపీవీలను అభివృద్ధి చేస్తోంది. రూ. 25,000 కోట్ల పెట్టుబడితో రాబోయే కొత్త ప్లాంట్లు, 5 భవిష్యత్తు మోడళ్ల పూర్తి వివరాలు మీకోసం..

Published on: Apr 6, 2026, 06:45:54 IST
Advertisement

భారత్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది టయోటా కిర్లోస్కర్ మోటార్. ఇప్పటివరకు గ్లాంజా, హైరైడర్, రూమియన్ వంటి మోడళ్ల కోసం మారుతీ సుజుకీతో పొత్తు పెట్టుకున్న టయోటా.. ఇకపై తన సొంత ఇంజినీరింగ్‌తో ఇన్-హౌస్ వాహనాలను తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్, బెంగళూరులో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25,000 కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించింది. అంతేకాదు ఈ సంస్థ నుంచి రానున్న సంవత్సరాల్లో అదిరిపోయే మోడల్స్​ లాంచ్​కు రెడీ అవుతున్నాయి.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే..
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే..

ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో టయోటా విడుదల చేయనున్న ఆ 5 కీలక వాహనాల పూర్తి వివరాలు ఇవే..

1. ఇన్నోవా హైక్రాస్ - లోయర్ స్పెక్ వేరియంట్

ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న డీజిల్ ఇంజిన్, లాడర్-ఫ్రేమ్ 'ఇన్నోవా క్రిస్టా' ఎంపీవీని 2027లో నిలిపివేయనున్నారు. CAFE 3 ఉద్గార నియమాలే ఇందుకు కారణం. ఆ లోటును భర్తీ చేసేందుకు టయోటా 'ఇన్నోవా హైక్రాస్'లో ఒక లోయర్-స్పెక్ హైబ్రిడ్ వెర్షన్‌ను (కోడ్ నేమ్: 840డీ) తీసుకురానుంది. ఫ్లీట్ ఆపరేటర్లు, ట్రావెల్స్ యజమానుల కోసం తక్కువ ఫీచర్లతో, సరసమైన ధరలో ఇది అందుబాటులోకి రానుంది. అలాగే ఇందులో 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో నడిచే 'ఫ్లెక్స్-ఫ్యూయల్' ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ మోడల్​ 2027లో లాంచ్​ అవుతుందని అంచనా.

2. మారుతీ ఎలక్ట్రిక్ ఎంపీవీ డెరివేటివ్..

మారుతీ సుజుకీ అభివృద్ధి చేస్తున్న ఆల్-ఎలక్ట్రిక్ త్రీ-రో ఎంపీవీ (కోడ్ నేమ్: వైఎంసీ) ఆధారంగా టయోటా తన సొంత ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. 'హార్టెక్-ఈ' ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యే ఈ కారు నేరుగా బీవైడీ ఈమ్యాక్స్​ 7 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఆఫ్‌రోడ్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జెడ్' (బేబీ ల్యాండ్ క్రూయిజర్) 2028 చివరి నాటికి భారత్‌లో లాంచ్ కానుంది. ఇది ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్ నుంచి వచ్చే మొదటి మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఫార్చ్యూనర్, హిలక్స్ వాడే దృఢమైన 'ఐఎంవీ' ప్లాట్‌ఫారమ్‌పైనే ఇది తయారవుతుంది. ఉద్గార నియమాల దృష్ట్యా ఇందులో డీజిల్ ఇంజిన్ ఉండదు. దానికి బదులుగా 163 హెచ్​పీ ఇచ్చే 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉండనున్నాయి.

4. టయోటా కొరోల్లా క్రాస్..

గతంలో నిలిపివేసిన కొరోల్లా క్రాస్ ప్రాజెక్ట్‌ను టొయోటా మళ్లీ పట్టాలెక్కించింది. శాంభాజీనగర్ ఫెసిలిటీ నుంచి 2028 చివరిలో లేదా 2029 ప్రారంభంలో ఈ ఎస్‌యూవీ రోడ్లపైకి రానుంది. కేవలం ఎస్‌యూవీ మాత్రమే కాకుండా, ఇదే ప్లాట్‌ఫారమ్‌పై మరిన్ని బాడీ స్టైల్స్ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

ఇది 2028 లేదా 2029లో మార్కెట్​లోకి వస్తుందని అంచనా.

5. థర్డ్ జనరేషన్ ఫార్చ్యూనర్..

కొత్త తరం ఫార్చ్యూనర్ (కోడ్ నేమ్: 582డీ) తన సిగ్నేచర్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించనుంది. అయితే ఇందులో 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని జత చేయనున్నారు. ఉద్గార నియమాలు కఠినతరం అవుతున్నప్పటికీ, తక్కువ అమ్మకాల వాల్యూమ్ ఉండటం వల్ల దీనికి లాడర్-ఫ్రేమ్ సెటప్‌నే టయోటా ఖరారు చేసింది.

దీని లాంచ్​ టైమ్​లైన్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. టయోటా తన కొత్త కార్ల కోసం మారుతీ సుజుకీపై ఆధారపడటం తగ్గిస్తోందా?

అవును, గ్లాంజా వంటి రీ-బ్యాడ్జ్ మోడళ్ల కంటే భవిష్యత్తులో రాబోయే ఫార్చ్యూనర్, ఇన్నోవా హైక్రాస్ వంటి కీలక వాహనాలను టయోటా తన సొంత ప్లాంట్లలోనే స్వయంగా తయారు చేయాలని నిర్ణయించుకుంది.

2. భవిష్యత్తులో ఇన్నోవా క్రిస్టా డీజిల్ వెర్షన్ నిలిపివేతకు కారణం ఏంటి?

కఠినతరమైన CAFE 3 ఉద్గార నియమాల కారణంగా 2027 నాటికి క్రిస్టా డీజిల్ మోడల్‌ను నిలిపివేసి, దాని స్థానంలో తక్కువ ధరలో ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్‌ను టయోటా అందుబాటులోకి తేనుంది.

3. కొత్త తరం ఫార్చ్యూనర్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి?

మూడవ తరం ఫార్చ్యూనర్‌లో పాత 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొనసాగిస్తూనే, మైలేజ్, పర్ఫార్మెన్స్ మెరుగుపరిచేందుకు కొత్తగా 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని జత చేయనున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe