భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది టయోటా కిర్లోస్కర్ మోటార్. భారత్‌లో తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ను మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది. మారుతీ సుజుకీ ఈ- విటారా ఆధారంగా రూపొందిన ఈ మోడల్‌తో టయోటా ఇప్పుడు మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- బుకింగ్స్..

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాని ఆవిష్కరించడంతో పాటు ఈ ఈవీ బుకింగ్స్‌ని సైతం సంస్థ ప్రారంభించింది. రూ. 25,000 చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- అదిరిపోయే డిజైన్..
ఎబెల్లా చూడటానికి మారుతీ సుజుకీ ఈ-విటారాను పోలి ఉన్నప్పటికీ, టయోటా తన మార్కు స్టైలింగ్‌ను దీనికి జోడించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో టయోటా కార్లకు ఉండే డిజైన్ లాంగ్వేజ్‌ను దీనికి వాడారు.
డైమెన్షన్స్: 4,285 ఎంఎం పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,640 ఎంఎం ఎత్తుతో ఇది రోడ్డుపై భారీగా కనిపిస్తుంది.
- Tata Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్- తక్కువ ధరలో అదిరిపోయే సేఫ్టీ - పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీల్‌బేస్: 2,700 ఎంఎం వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది.
రంగులు: కేఫ్ వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ వంటి ఆకర్షణీయమైన సింగిల్ టోన్ రంగులతో పాటు బ్లాక్ రూఫ్ వచ్చే డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఈ ఈవీలో అందుబాటులో ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- విలాసవంతమైన ఇంటీరియర్, ఫీచర్లు..
{{/usCountry}}రంగులు: కేఫ్ వైట్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్ వంటి ఆకర్షణీయమైన సింగిల్ టోన్ రంగులతో పాటు బ్లాక్ రూఫ్ వచ్చే డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఈ ఈవీలో అందుబాటులో ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- విలాసవంతమైన ఇంటీరియర్, ఫీచర్లు..
{{/usCountry}}కారు లోపలి భాగం బ్లాక్- బ్రౌన్ రంగుల డ్యూయల్ టోన్ థీమ్‌తో చాలా ప్రీమియంగా ఉంటుంది. ఆధునిక కారులో ఉండాల్సిన అన్ని హై-టెక్ ఫీచర్లను టయోటా ఇందులో పొందుపరిచింది.
"ప్రయాణికుల సౌకర్యం కోసం పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌ను అందించాము," అని కంపెనీ ప్రతినిధులు వివరించారు. భద్రత కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, లెవల్-2 అడాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా- బ్యాటరీ, రేంజ్..
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. అవి..
49 కేడబ్లూహెచ్ బ్యాటరీ: ఇది 106 హెచ్‌పీ పవర్‌ని పవర్‌ని ఇస్తుంది.
61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 171.6 హెచ్‌పీ పవర్, 189 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే ఈ ఎస్‌యూవీ గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇందులో 2డబ్ల్యూ, ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీ వల్ల ఇది ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఈవీకి సంబంధించిన ధరల వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
మీరు గనక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, ఈ టయోటా ఎబెల్లా ఖచ్చితంగా మీ లిస్ట్‌లో ఉండాల్సిన కారు!