Ultraviolette X 47 : రూ. 2,50,000 ఎలక్ట్రిక్ బైక్.. రూ. 1.49లక్షలకే! 320 కి.మీ రేంజ్‌తో..
Ultraviolette X 47 baas : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఆల్ట్రావయోలెట్.. తన సరికొత్త ఎక్స్-47 బైక్‌పై బీఏఏఎస్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర భారీగా దిగొచ్చింది! పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీలో వినూత్న పోకడలకు శ్రీకారం చుడుతున్న ఆల్ట్రావయోలెట్.. తన ఎక్స్-47 మోడల్ కోసం 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. దీనిని 'బ్యాటరీ ఫ్లెక్స్' అని పిలుస్తున్నారు. బైక్ ధరను, బ్యాటరీ ధరను వేరు చేయడం ద్వారా సామాన్యులకు కూడా ఈ ప్రీమియం బైక్ అందుబాటులోకి వచ్చేలా కంపెనీ చర్యలు తీసుకుంది.

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ 4 వీలర్లపైనే ఈ బీఏఏఎస్ స్కీమ్ అందుబాటులో ఉండేది. ఇక ఇప్పుడు 2 వీలర్‌కి కూడా లభిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 ఎలక్ట్రిక్ బైక్‌పై అందుబాటులో ఉన్న బీఏఏఎస్ స్కీమ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అల్ట్రావయోలెట్ ఎక్స్-47- ధర, సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.5లక్షల వరకు ఉంటుంది. కొత్త పేమెంట్ స్కీమ్ ప్రకారం.. వినియోగదారులు ఈ ఈ-బైక్‌ని కేవలం రూ. 1,49,000 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, బ్యాటరీ కోసం నెలకు రూ. 2,499 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ కింద బ్యాటరీ ప్యాక్‌పై 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. బైక్‌ను పూర్తిగా కొనుగోలు చేసినప్పటికీ, బ్యాటరీని మాత్రం విడిగా ఫైనాన్స్ లేదా సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో తీసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన భారీ మొత్తం గణనీయంగా తగ్గుతుంది.
ఈ వినూత్న ప్రయత్నానికి ఆర్థిక తోడ్పాటు అందించడం కోసం ఆల్ట్రావయోలెట్ సంస్థ 'ఎకోఫీ' అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 డిజైన్, బాడీ..
ఆల్ట్రావయోలెట్ X-47 ఒక పక్కా అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్. ఈ బైక్ హైలైట్స్ ఇవే..
లుక్: కంపెనీ ప్రసిద్ధ మోడల్ ఎఫ్77 నుంచి ప్రేరణ పొందిన హెడ్‌ల్యాంప్, యాంగ్యులర్ బాడీ స్ట్రక్చర్, సౌకర్యవంతమైన సింగిల్-పీస్ సీటు.
బిల్ట్: ఇందులో క్యాస్ట్ అల్యూమినియం ఛాసిస్‌ను ఉపయోగించారు. ఎయిర్ ప్రెజర్ నుంచి రైడర్‌కు రక్షణ కల్పించేందుకు విండ్‌స్క్రీన్‌ను అమర్చారు.
వేరియంట్: ఈ లైనప్‌లో భాగంగా కంపెనీ ఒక ప్రత్యేకమైన 'డెజర్ట్ వింగ్' ఎడిషన్‌ను కూడా పరిచయం చేసింది.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47- సాంకేతికత, భద్రత..
సాంకేతిక పరంగా ఈ బైక్ ఒక విప్లవం అని చెప్పొచ్చు. దీనిలోని అన్ని వేరియంట్లలో రాడార్ ఆధారిత అసిస్టెన్స్ సిస్టమ్ 'యూవీ హైపర్ సెన్స్' అందుబాటులో ఉంది.
కవరేజ్: ఇది 150 డిగ్రీల ఫ్రంట్ వ్యూ, 68 డిగ్రీల రియర్ వర్టికల్ వ్యూతో పాటు 200 మీటర్ల దూరం వరకు ట్రాకింగ్ చేయగలదు.
ఫీచర్లు: వెనుక నుంచి వచ్చే వాహనాల గురించి హెచ్చరించే రియర్ కొలిషన్ అలర్ట్స్, లేన్ మార్చే సమయంలో సహాయపడే లేన్ చేంజ్ అసిస్టెన్స్, ఓవర్‌టేక్ వార్నింగ్స్ ఇందులో ఉన్నాయి.
కంట్రోల్: డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్, తొమ్మిది స్థాయిల రీజెనరేటివ్ బ్రేకింగ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, టో అలర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అల్ట్రావయోలెట్ ఎక్స్-47- పర్ఫార్మెన్స్, బ్యాటరీ..
ఎక్స్-47 పవర్‌ఫుల్ 10.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
మోటర్ సామర్థ్యం: దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 40 హెచ్‌పీ పవర్, 610 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్పీడ్: కేవలం 8.1 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 145 కి.మీ.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కిలోమీటర్లు (ఐడీసీ రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
ఛార్జింగ్: 1.6 కేడబ్ల్యూ ఆన్‌బోర్డ్ ఎయిర్-కూల్డ్ యూనిట్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో సర్జ్ ప్రొటెక్షన్, ఎర్త్ లీకేజ్ ప్రొటెక్షన్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. అసలు ఈ బీఏఏఎస్ పథకం ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కొనుగోలుదారుడికి కలిగే ప్రధాన లాభం ఏమిటి?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం ధరలో 30 నుంచి 40 శాతం ఖర్చు కేవలం బ్యాటరీదే ఉంటుంది. బీఏఏఎస్ పథకంలో భాగంగా, మీరు వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాహనం బాడీ ధరను మాత్రమే చెల్లిస్తారు. బ్యాటరీని కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నట్లుగా భావించవచ్చు.
ప్రధాన లాభం: వాహన ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు, ఆల్ట్రావయోలెట్ ఎక్స్-47 విషయంలో బ్యాటరీ లేకుండా బైక్ ధర కేవలం రూ. 1.49 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల పెట్రోల్ బైక్ కొన్నంత సులభంగా ఈవీని సొంతం చేసుకోవచ్చు.
2. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ పాడైపోతే లేదా దాని సామర్థ్యం తగ్గితే బాధ్యత ఎవరిది?
ఇది బీఏఏఎస్ పథకంలోని అతిపెద్ద సానుకూల అంశం. బ్యాటరీ మీ సొంతం కాదు కాబట్టి, దాని నిర్వహణ బాధ్యత పూర్తిగా తయారీ సంస్థదే ఉంటుంది.
వారంటీ, రీప్లేస్‌మెంట్: మీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తున్నంత కాలం, బ్యాటరీ పనితీరులో ఏవైనా లోపాలు తలెత్తినా లేదా దాని ఛార్జింగ్ సామర్థ్యం నిర్ణీత స్థాయి కంటే తగ్గినా, కంపెనీ ఉచితంగా రిపేర్ చేయడం లేదా మార్చడం వంటివి చేస్తుంది. ఆల్ట్రావయోలెట్ ఎక్స్-47 ప్లాన్‌లో దీనికోసం ఏకంగా 5 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ గురించి వినియోగదారులకు ఎలాంటి ఆందోళన ఉండదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


