UPSC prelims 2026 : మీ యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
UPSC prelims 2026 admit card : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనుంది. మే 24న పరీక్ష జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను upsc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష (సీఎస్ఈ) 2026 అడ్మిట్ కార్డుల కోసం నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఈ హాల్ టికెట్లను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది. లక్షలాది మంది పోటీ పడే ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు మే 24వ తేదీ ముహూర్తంగా ఖరారైన సంగతి తెలిసిందే.

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2026- గత ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి?
సాధారణంగా యూపీఎస్‌సీ తన పరీక్షలకు 10 నుంచి 15 రోజుల ముందే అడ్మిట్ కార్డులను జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది (2025లో) మే 25న పరీక్ష జరగ్గా, మే 14వ తేదీనే హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈసారి పరీక్ష మే 24, 2026న జరగనున్న నేపథ్యంలో, అడ్మిట్ కార్డులు ఈపాటికే సిద్ధమయ్యాయని, ఏ క్షణమైనా వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అవుతుందని సమాచారం. అభ్యర్థులు నిరంతరం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2026 అడ్మిట్ కార్డ్ ఎందుకు కీలకం?
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2026 పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ఇది కేవలం ఒక పాస్ మాత్రమే కాదు, అభ్యర్థి అర్హతను ధృవీకరించే అత్యంత ముఖ్యమైన పత్రం. అడ్మిట్ కార్డు లేకుండా ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని యూపీఎస్‌సీ స్పష్టం చేసింది. ఇందులో మీ ఫోటో, సంతకంతో పాటు కింది వివరాలు ఉంటాయి:
- అభ్యర్థి పూర్తి పేరు, రోల్ నంబర్
- కేటాయించిన పరీక్షా కేంద్రం చిరునామా
- పరీక్షా సమయం, రిపోర్టింగ్ టైమ్
- అభ్యర్థులకు అవసరమైన ముఖ్యమైన సూచనలు
స్టెప్-బై-స్టెప్: హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..
మీ అడ్మిట్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది పద్ధతిని అనుసరించండి:
మొదట యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే "E-Admit Card: Civil Services (Preliminary) Examination, 2026" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ ఇచ్చిన నిబంధనలను జాగ్రత్తగా చదివి, 'Yes' బటన్ నొక్కండి.
ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఐడీ (Registration ID) లేదా రోల్ నంబర్ (Roll Number) ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోండి.
మీ వివరాలతో పాటు పుట్టిన తేదీని నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
వివరాలు సమర్పించగానే మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
వెంటనే దానిని ప్రింట్ తీసుకుని, సాఫ్ట్ కాపీని కూడా భద్రపరుచుకోండి.
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2026- పరీక్ష రోజున గుర్తుంచుకోవాల్సినవి..
కేవలం హాల్ టికెట్ మాత్రమే కాకుండా, అభ్యర్థులు తమతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాస్‌పోర్ట్ వంటివి) తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. అడ్మిట్ కార్డులోని ఫోటో సరిగ్గా లేని పక్షంలో, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకెళ్లడం క్షేమదాయకం. పరీక్షా సమయానికి కనీసం 30-60 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవడం వల్ల అనవసరపు టెన్షన్‌ను నివారించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


