UPSC recruitment 2026 : యూపీఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​ పోస్టులు- దరఖాస్తుకు ఇంకొన్ని రోజులే ఛాన్స్..

UPSC assistant professor recruitment : యూపీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి 47 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వంటి పలు పోస్టులు ఇందులో ఉన్నాయి. జులై 31 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 25, 2026, 05:59:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కమిషన్ (యూపీఎస్సీ) మంచి అవకాశం తీసుకొచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 47 కీలక పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్, ప్రాసిక్యూటర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (ఎంటమాలజీ), ఎంటమాలజిస్ట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ) వంటి పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్.. (HT_PRINT)
యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్.. (HT_PRINT)

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా జులై 31, 2026 సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీల వివరాలు ఇవే..

మొత్తం 47 ఖాళీలలో పోస్టుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్ – 2

ప్రాసిక్యూటర్ – 1

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ హెమటాలజీ) – 9

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ) – 10

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ) – 13

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూక్లియర్ మెడిసిన్) – 3

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పల్మోనరీ మెడిసిన్) – 3

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ కార్డియాలజీ) – 1

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ) – 1

డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (ఎంటమాలజీ) – 2

ఎంటమాలజిస్ట్ (సీసీసీఓ) – 1

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ) – 1

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హతలు, అనుభవం..

ఎంచుకునే పోస్టును బట్టి విద్యార్హతలు మారతాయి. మెడికల్ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్​తో పాటు సంబంధిత సబ్జెక్ట్‌లో సూపర్ స్పెషలైజేషన్ డిగ్రీ, బోధనా అనుభవం తప్పనిసరి. ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో (అగ్రికల్చర్, జువాలజీ, పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ, టాక్సికాలజీ, లా) మాస్టర్స్ డిగ్రీతో పాటు నిర్దేశిత అనుభవం ఉండాలని యూపీఎస్సీ పేర్కొంది.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి, వేతనం..

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026 పోస్టులు, కేటగిరీలను బట్టి గరిష్ఠ వయోపరిమితి 33 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ 8, లెవెల్ 10, లెవెల్ 11 హోదాలో జీతభత్యాలు చెల్లిస్తారు. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వేతనంతో పాటు నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (ఎన్​పీఏ) కూడా లభిస్తుంది.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తుకు చివరి తేదీ..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 31, 2026 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపాలని యూపీఎస్సీ హెచ్చరించింది. పొరపాటు సమాచారం ఇస్తే పరిశీలన సమయంలో దరఖాస్తును తిరస్కరిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More