అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా భారీ పేలుళ్లు వినిపించాయి.

ఇరాన్ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.
మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ‘లయన్స్ రోర్’ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టగా…భారీ సంఖ్యలో ఇరాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు జరిగాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
స్పందించిన ట్రంప్…
ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టిందన్నారు. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు చేపట్టామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ… ఈ జాయింట్ ఆపరేషన్ ను ధ్రువీకరించారు. ఈ దాడుల సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయాల్లో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇరాన్ ప్రతిదాడులు…
ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడికి దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ లక్ష్యంగా ప్రతిదాడులు చేస్తోంది. 35కి పైగా మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ కూడా తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. యుద్ధం మీరు ప్రారంభించారు… మేం ముగింపు పలుకుతామని హెచ్చరిస్తోంది. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
{{/usCountry}}అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ కూడా తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. యుద్ధం మీరు ప్రారంభించారు… మేం ముగింపు పలుకుతామని హెచ్చరిస్తోంది. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
{{/usCountry}}ఇక ఊహించని దాడి ఘటనతో ఇరాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ అక్కడి ప్రజలు గడుపుతున్నారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులతో ఇజ్రాయెల్‌లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిస్సైల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో…. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా…. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది.టెహ్రాన్ అంతటా పేలుళ్లు మోగడంతో పైలట్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.