అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం ఉత్కంఠభరిత ఘట్టానికి చేరుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలన సగం గడిచిన వేళ, ఆయన నాయకత్వానికి, పాలనా విధానాలకు పరీక్షగా భావిస్తున్న 2026 అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా దాదాపు 23 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు అందరి కళ్లు కౌంటింగ్, ఆ వెను వెంటనే వెలువడే ఫలితాలపైనే నెలకొన్నాయి.

వాషింగ్టన్ పీఠంపై ఆధిపత్యం ఎవరిది? ట్రంప్‌నకు చెక్ పడుతుందా? లేక రిపబ్లికన్లు తమ పట్టును నిలుపుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం యూఎస్ పార్లమెంట్ (కాంగ్రెస్)లోని రెండు సభలైన ప్రతినిధుల సభ, సెనెట్‌లో ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది. అయితే ఈ మెజారిటీ చాలా స్వల్పంగా ఉండటంతో డెమోక్రాట్లు ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి లక్షలాది మంది ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ నిపుణులు, విద్యార్థులు అమెరికాలో నివసిస్తున్నారు. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ విధానాలు, గ్లోబల్ ఐటీ మార్కెట్‌పై ట్రంప్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు మన తెలుగు వారికి కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సెనెట్‌లో 7 స్థానాలపై డెమోక్రాట్ల కన్ను!
ఈ యూఎస్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 స్థానాలకు గానూ 35 స్థానాలకు పోలింగ్ జరిగింది. సెనెట్‌లో పోటీ జరుగుతున్న 35 స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు ప్రస్తుతం రిపబ్లికన్ల చేతిలోనే ఉన్నాయి.
డెమోక్రాట్లు ప్రధానంగా ఏడు కీలక రాష్ట్రాలపై దృష్టి సారించారు:
- మిచిగాన్
- మైన్
- ఒహాయో
- కాన్సాస్
- టెక్సాస్
- ఐయోవా
- అలాస్కా
డెమోక్రాట్లు ప్రధానంగా ఏడు కీలక రాష్ట్రాలపై దృష్టి సారించారు:
- మిచిగాన్
- మైన్
- ఒహాయో
- కాన్సాస్
- టెక్సాస్
- ఐయోవా
- అలాస్కా
ది న్యూయార్క్ టైమ్స్, సీనా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ప్రీ-ఎలక్షన్ పోల్స్ ప్రకారం ఈ ఏడు కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లకే కాస్త మొగ్గు కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ దిగువ సభలో స్పీకర్ మైక్ జాన్సన్ నాయకత్వంలోని రిపబ్లికన్లకు 218 స్థానాలు, కేవిన్ కిలీ మద్దతుతో కలిపి బలముండగా.. డెమోక్రాట్లకు 214 స్థానాలు ఉన్నాయి. ఎగువ సభ అయిన సెనెట్‌లో రిపబ్లికన్లు 53, డెమోక్రాట్లు 47 స్థానాలు కలిగి ఉన్నారు.
డెమోక్రాట్లు సెనెట్ హస్తగతం చేసుకోవాలంటే అదనంగా 4 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్ పరిస్థితి ఏంటి?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్‌లోని రెండు సభల్లో ఏదో ఒక సభ డెమోక్రాట్ల వశమైతే వైట్‌హౌస్‌లో ట్రంప్ పాలనకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతాయి.
కఠిన సమీక్షలు: ట్రంప్ యంత్రాంగం తీసుకునే వివాదాస్పద నిర్ణయాలు, విధానాలపై విచారణలు తీవ్రతరం అవుతాయి.
బిల్లుల ఆమోదం కష్టం: ట్రంప్ ప్రతిపాదించే కీలక చట్టాలు, బడ్జెట్ ఆమోదం పొంది అమలులోకి రావడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు: పార్లమెంట్ మద్దతు లేకపోతే ట్రంప్ కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ల ద్వారా మాత్రమే పాలన సాగించాల్సి వస్తుంది. వీటిని న్యాయస్థానాలు రద్దు చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
అమెరికా వ్యాప్తంగా వేర్వేరు టైమ్ జోన్లు ఉండటంతో పోలింగ్ ముగిసే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. కాగా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనందున భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం నుంచే ముందస్తు ఫలితాల సరళి వెలువడటం ప్రారంభమవుతుంది.
అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి ఓట్ల లెక్కింపునకు వేర్వేరు నిబంధనలు ఉంటాయి. మెయిల్-ఇన్ బ్యాలెట్లు (తపాలా ఓట్లు), ముందస్తు ఓటింగ్‌లను లెక్కించడానికి కొన్ని రాష్ట్రాల్లో సమయం పడుతుంది. గడిచిన ఎన్నికల రికార్డులను చూస్తే.. ప్రతినిధుల సభలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చిందో తేలడానికి దాదాపు వారం రోజులకు పైగా సమయం పట్టే అవకాశమూ ఉంది.
ఏకంగా 5.7 కోట్ల ముందస్తు ఓటింగ్!
ఈసారి అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌లో రికార్డు సృష్టించారు. అసలు పోలింగ్ రోజు కంటే ముందే 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ వ్యాప్తంగా దాదాపు 5.7 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో పడిన 4.45 కోట్ల ముందస్తు ఓట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం.
ఈ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులతో కూడిన నూతన యూఎస్ కాంగ్రెస్ 2027 జనవరి 3న అధికారికంగా కొలువుదీరనుంది.