...
...
Next Story

Electric scooter : విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ లాంచ్- ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, రేంజ్..

హీరో విడా బ్రాండ్ తన వీఎక్స్‌2 లైనప్‌లో 'విడా వీఎక్స్2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్' ఫిక్స్‌డ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రూ. 1.13 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్కూటర్ ఫీచర్లు, ఛార్జింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 1, 2026, 14:01:49 IST
Advertisement

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఈవీ బ్రాండ్ 'విడా'.. భారత ఈవీ మార్కెట్లోకి మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. తన పాపులర్ వీఎక్స్‌2 సిరీస్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఆప్షన్‌తో కూడిన 'విడా VX2 Go FB 3.1 kWh' మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్..
విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్..

ఈ కొత్త ఈ- స్కూటర్ ఎక్స్​షోరూం ధరను రూ. 1.13 లక్షలుగా నిర్ణయించారు.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న రిమూవెబుల్ బ్యాటరీ మోడళ్లతో పాటు నేరుగా ప్లగ్ పాయింట్ ద్వారా ఛార్జ్ చేసుకోవాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని రూపొందించింది. భారతీయ కుటుంబాలకు విద్యుత్ వాహనాల యాజమాన్యాన్ని, ఛార్జింగ్ విధానాలను మరింత సులభతరం చేసేందుకు తాము చేపట్టిన “ఘర్ ఘర్ ఇవూటర్” లక్ష్యానికి ఈ మోడల్ ఎంతగానో తోడ్పడుతుందని హీరో విడా పేర్కొంది.

వీఎక్స్‌2 లైనప్‌లో కొత్త ఆప్షన్..

ఈ కొత్త స్కూటర్‌లో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీయే ప్రధాన ఆకర్షణ. రిమూవబుల్ బ్యాటరీల కోసం ప్రత్యేకంగా పోర్టబుల్ ఛార్జర్లను వెతుక్కోవాల్సిన పనిలేకుండా, ఇళ్లలో ఉండే సాధారణ వాల్ సాకెట్‌కు ప్లగ్ చేసి దీనిని సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం విడా వీఎక్స్‌2 లైనప్‌లో మొత్తం ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

వీఎక్స్​2 గో (2.2 kWh): ఐడీసీ ప్రమాణాల ప్రకారం 93 కిమీ రేంజ్ ఇస్తుంది.

వీఎక్స్2 గో (3.4 kWh), వీఎక్స్​2 ప్లస్ (3.4 kWh): ఈ రెండూ 146 కిమీ రేంజ్ ఇస్తాయి.

వీఎక్స్2 ప్లస్ (4.4 kWh): గరిష్టంగా 187 కిమీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.

విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్- స్పెసిఫికేషన్లు..

పనితీరు విషయానికి వస్తే, విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పవర్‌ఫుల్ 6 kW స్వింగ్-ఆర్మ్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతిరోజూ నగరాల్లో రాకపోకలు సాగించే వారి అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు పొడవైన సీటును, లగేజ్ భద్రపరుచుకోవడానికి 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌ను అందించారు.

రైడర్ సమాచారం కోసం ఇందులో 4.3 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కేటాయించారు. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి, టర్న్-బై-టర్న్ నేవిగేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. అత్యవసరంగా ప్రయాణించాలనుకునే వారి కోసం డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.

విడా వీఎక్స్​2 గో ఎఫ్​బీ 3.1 కేడబ్ల్యూహెచ్- సేల్స్..

కొత్త స్కూటర్‌తో పాటు కస్టమర్ల సౌకర్యార్థం 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) మోడల్‌ను కూడా విడా అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు తమ వినియోగానికి తగినట్లుగా ఓనర్‌షిప్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఆగస్టు ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

(గమనిక: పైన పేర్కొన్న రూ. 1.13 లక్షల ధర ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర మాత్రమే. ఇందులో పీఎంఈడీ సబ్సిడీ లేదా ఎలాంటి ప్రత్యేక ఆఫర్లు చేర్చలేదు)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe