చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన వై-సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా 'వివో వై500ఐ'స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది మూడు ఆకర్షణీయమైన రంగులు, ఐదు రకాల స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
వివో వై500ఐ- ధర, లభ్యత..

చైనాలో ఈ వివో వై500ఐ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ (8GB+128GB) ధరను 1,499 యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 19,000. ఇతర వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:
- 8GB+256GB: సుమారు రూ. 23,000
- 8GB+512GB: సుమారు రూ. 26,000
- 12GB+256GB: సుమారు రూ. 26,000
- 12GB+512GB (టాప్ ఎండ్): సుమారు రూ. 28,000
ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ సిల్వర్, ఫోనిక్స్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో మెరిసిపోతోంది.
వివో వై500ఐ- అద్భుతమైన ఫీచర్లు..
బ్యాటరీ దీని హైలైట్: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఈ ఫోన్ వైపు చూడటానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న 7,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ అని చెప్పుకోవాలి. దీనికి తోడు ఈ వివో వై500ఐలో 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక ఫోన్ బరువు విషయానికి వస్తే 219 గ్రాములు ఉంటుంది. 8.39ఎంఎం మందంతో స్లిమ్‌గానే కనిపిస్తుంది.
డిస్ప్లే, పర్ఫార్మెన్స్: వివో వై500ఐ స్మార్ట్ఫఫోన్లో 6.75 ఇంచ్ ఎల్‌సీడీ డిస్ప్లేని అందించారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. దీనివల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఇది నడుస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఈ ఫోన్ పనిచేస్తుండటం విశేషం.
కెమెరా విశేషాలు: వివో వై500ఐ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది 10x డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్ ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 1080పీ రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}కెమెరా విశేషాలు: వివో వై500ఐ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది 10x డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్ ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 1080పీ రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}ఇతర ప్రత్యేకతలు: వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఈ ఫోన్ నీటిలో పడినా పాడయ్యే అవకాశం చాలా తక్కువ. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ వివో వై500ఐ ఇండియా లాంచ్‌పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఒక అప్డేట్ వెలువడే అవకాశం ఉంది.