Vivo Y600 pro : 10,200ఎంఏహెచ్ బడా బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్- ధర ఎంతంటే..
Vivo Y600 pro India launch : స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆశ్చర్యపరిచేలా వివో తన 'వై' సిరీస్‌లో సరికొత్త సంచలనాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా పవర్ బ్యాంక్‌లలో కనిపించే రేంజ్‌లో ఏకంగా 10,200ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై600 ప్రోని లాంచ్ చేసింది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు, ధర వివరాలు ఇవిగో..
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో బ్యాటరీ లైఫ్ అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు చెక్ పెడుతూ వివో సంస్థ సోమవారం చైనాలో వివో వై600 ప్రోని అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న తొలి ఫోన్లలో ఒకటిగా ఇది నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివో వై600 ప్రో ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

వివో వై600 ప్రో- బ్యాటరీ అల్టిమేట్.. చార్జింగ్ స్పీడ్ సూపర్!
ఈ వివో వై600 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 10,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. సాధారణంగా మనం వాడే ఫోన్లలో 5,000ఎంఏహెచ్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది, దానికి ఇది రెట్టింపు సామర్థ్యం. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, దీనిని వేగంగా చార్జ్ చేసేందుకు 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను వివో అందించింది. ఇక ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఇది కేవలం 8.15ఎంఎం మందం ఉండటం విశేషం.
వివో వై600 ప్రో- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..
వివో వై600 ప్రోలో 6.83 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల వీడియోలు చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
చిప్‌సెట్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఈ (6ఎన్ఎం) ప్రాసెసర్‌ను వాడారు.
ఓఎస్: లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఇది నడుస్తుంది.
రెసిస్టెన్స్: ధూళి, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.
వివో వై600 ప్రో- కెమెరా విశేషాలు..
ఫోటోగ్రఫీ కోసం ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది 10ఎక్స్ డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను సెంటర్ హోల్-పంచ్ డిజైన్‌లో అమర్చారు. తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటోలు తీసేలా దీనిని డిజైన్ చేశారు.
వివో వై600 ప్రో- ధర, లభ్యత..
ఈ ఫోన్ చైనాలో మే 5 నుంచి అమ్మకానికి రానుంది. దీని ప్రారంభ ధర 2,099 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 29,000).
8 జీబీ + 128 జీబీ: రూ. 29,000 (సుమారు)
12 జీబీ + 512 జీబీ (టాప్ ఎండ్): రూ. 40,000 (సుమారు)
బైట్ మూన్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్ వైలెట్, వాస్ట్ బ్లూ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
భారత్‌లో ఈ వివో వై600 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎంత ధర ఉంటుంది? అనే వాటిపై వివో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. Vivo Y600 Pro బ్యాటరీ సామర్థ్యం ఎంత?
ఈ స్మార్ట్‌ఫోన్ 10,200mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
2. ఈ ఫోన్ ధర ఎంత ఉండవచ్చు?
చైనాలో దీని ప్రారంభ ధర సుమారు రూ. 29,000 గా ఉంది. టాప్ వేరియంట్ ధర సుమారు రూ. 40,000 వరకు ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


