వాట్సాప్ వెబ్ వినియోగదారులకు మెటా సంస్థ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు కేవలం మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ అప్లికేషన్‌కే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా వెబ్ బ్రౌజర్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందనుంది.
వాట్సాప్ వెబ్ ఫీచర్- వన్ అన్ వన్ కాలింగ్..

ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ ద్వారా వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లలో మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలరు.
ఎలా వాడాలి: ఏదైనా వ్యక్తిగత చాట్ ఓపెన్ చేసినప్పుడు, పైన కుడి వైపున వాయిస్ అండ్ వీడియో కాల్ ఐకాన్లు కనిపిస్తాయి.
సాఫ్ట్‌వేర్ అవసరం లేదు: దీని కోసం ప్రత్యేకంగా ఎటువంటి అదనపు సాఫ్ట్‌వేర్ లేదా ఎక్స్‌టెన్షన్లు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా బ్రౌజర్ (క్రోమ్, ఫైర్ఫాక్స్, సాఫారీ మొదలైనవి) నుంచే కాల్స్ మాట్లాడవచ్చు.
వాట్సాప్ వెబ్ ఫీచర్- వీడియో కాల్‌లో స్క్రీన్ షేరింగ్..
వాట్సాప్ వెబ్‌లో ఇక కేవలం కాల్స్ మాత్రమే కాకుండా, వీడియో కాల్ సమయంలో మీ కంప్యూటర్ స్క్రీన్‌ను షేర్ చేసే సదుపాయాన్ని కూడా సంస్థ కల్పించింది. ఇది ముఖ్యంగా ఆఫీస్ మీటింగులు, ప్రెజెంటేషన్లు లేదా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వాట్సాప్ వెబ్ ఫీచర్- భద్రతకు పెద్దపీట..
వెబ్ బ్రౌజర్ ద్వారా కాల్స్ చేసినప్పటికీ, భద్రత విషయంలో వాట్సాప్ ఎక్కడా తగ్గలేదు!
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: మొబైల్ యాప్‌లో లాగానే వెబ్ కాల్స్ కూడా పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయి.
మీ సంభాషణలను మూడొవ వ్యక్తి లేదా మెటా సంస్థ కూడా వినడానికి, చూడటానికి వీలుండదు.
{{/usCountry}}మీ సంభాషణలను మూడొవ వ్యక్తి లేదా మెటా సంస్థ కూడా వినడానికి, చూడటానికి వీలుండదు.
{{/usCountry}}గమనిక: ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ‘వాట్సాప్ వెబ్ బీటా’ ప్రోగ్రామ్‌లో ఉన్న వారికి మాత్రమే కనిపిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో సాధారణ వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది.
మీ కొత్త వాట్సాప్ వెబ్ ఫీచర్స్‌ని పొందడకం కోసం హెల్ప్-అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌లోని సెట్టింగ్స్‌కి వెళ్లి బీటా ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. అయితే, చేరినప్పటికీ మీకు వెంటనే యాక్సిస్ లభిస్తుందని కచ్చితంగా చెప్పడానికి లేదు.
వాట్సాప్ వెబ్- త్వరలో మరిన్ని ఫీచర్లు..
ప్రస్తుతం గ్రూప్ కాలింగ్ సదుపాయం లేనప్పటికీ, భవిష్యత్తులో 32 మంది వరకు ఒకేసారి గ్రూప్ కాల్ మాట్లాడుకునే ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సాప్ కసరత్తు చేస్తోంది. దీనితో పాటు కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా రానున్నాయి.