...
...
Next Story

చరిత్ర సృష్టించే సమయం.. మరికాసేపట్లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.. ప్రపంచకప్ ఫైనల్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

భారత అమ్మాయిల క్రికెట్ జట్టు హిస్టరీకి అడుగుదూరంలో నిలిచింది. తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడటానికి టీమ్ కు మరొక్క గెలుపు మాత్రమే కావాలి. ఇవాళ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ను ఎప్పుడు, ఎక్కడ లైవ్ లో చూడాలనే వివరాలు ఇక్కడున్నాయి.

Published on: Nov 2, 2025, 14:10:36 IST
Advertisement

ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ ను తొలిసారి ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలిసారి మహిళల ఐసీసీ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం టీమిండియాను ఊరిస్తోంది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్

ప్రపంచకప్ తో ఇండియా, సౌతాఫ్రికా కెప్టెన్లు (BCCI Women - X)
ప్రపంచకప్ తో ఇండియా, సౌతాఫ్రికా కెప్టెన్లు (BCCI Women - X)

సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల రికార్డు ఛేదనతో అద్భుత విజయం సాధించిన ఇండియా జట్టు ఉత్సాహంతో ఉంది. అయితే, బలమైన దక్షిణాఫ్రికా జట్టు అడ్డుగా నిలవడంతో అసలు పని ఇంకా మిగిలే ఉంది. ఈ ఎనిమిది జట్ల టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు అద్భుతంగా ఆడింది. గౌహతిలో జరిగిన మరో సెమీ-ఫైనల్‌లో 2017 ఛాంపియన్ ఇంగ్లండ్‌ను సునాయాసంగా ఓడించింది.

తొలి విజయం

భారత్, దక్షిణాఫ్రికా రెండు జట్లూ తమ తొలి ప్రపంచ కప్ విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. కాబట్టి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన జెమీమా రోడ్రిగ్స్ పై మరోసారి భారీ అంచనాలున్నాయి. 2025 ప్రపంచ కప్‌లో తన తొలి మ్యాచ్‌లో అందరినీ నిరాశపరిచిన షఫాలీ వర్మను యాజమాన్యం కొనసాగిస్తుందో లేదో చూడాలి.

టీమ్ గెలవాలంటే

బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురైన ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ స్థానంలో షఫాలీని జట్టులోకి తీసుకున్నారు. భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఆతిథ్య జట్టు ప్రొటీస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, సీనియర్ ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్‌లను కట్టడి చేయాల్సి ఉంటుంది.

ప్రపంచ కప్ ఫైనల్ స్ట్రీమింగ్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks