...
...
Next Story

Wonderla Hyderabad : 'వాలెంటైన్స్​ డే'కి వండర్లా అదిరిపోయే ఆఫర్లు- ప్రేమ ప్రయాణంలో సరికొత్త థ్రిల్!

హైదరాబాద్ వండర్లా ఈ వాలెంటైన్స్ డేను సరికొత్తగా ప్లాన్ చేసింది. కేవలం డిన్నర్, సినిమాలకే పరిమితం కాకుండా.. థ్రిల్లింగ్ రైడ్స్, వేవ్ పూల్ వద్ద లైవ్ బ్యాండ్ మ్యూజిక్, స్కై వీల్‌పై ఆకాశంలో విందు వంటి అద్భుతమైన ఆఫర్లతో జంటల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఆ వివరాలు..

Published on: Feb 13, 2026, 06:00:16 IST
Advertisement

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రేమికుల రోజున అదే రొటీన్ డిన్నర్, సినిమాల ప్లాన్​ బోర్ కొడుతోందా? అయితే మీ భాగస్వామితో కలిసి సరికొత్తగా, థ్రిల్లింగ్‌గా జరుపుకోవడానికి హైదరాబాద్ 'వండర్లా' బంపర్​ ఆఫర్​ని ప్రకటించింది. రొమాన్స్‌కు కాస్త అడ్వెంచర్‌ను జోడిస్తూ వండర్లా ఈ వాలెంటైన్స్​ డే సందర్భంగా జంటల కోసం ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది. అంతేకాదు టికెట్లపై భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది.

హైదరాబాద్​ వండర్లా ఆఫర్లు..
హైదరాబాద్​ వండర్లా ఆఫర్లు..

“పూలు, చాక్లెట్ల కంటే కలిసి ఆస్వాదించే జ్ఞాపకాలు మిన్న” అని నమ్మే జంటల కోసం వండర్లా ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

హైదరాబాద్​ వండర్లా- కపుల్ టికెట్స్ అండ్​ ప్యాకేజీలు..

హైదరాబాద్​ వండర్లాలో టికెట్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇవి ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

టికెట్​ ఫర్​ టూ (11 గంటలు)- దీని వాస్తవ ధర రూ. 3354.2. ఆఫర్​లో దీనిని రూ. 2399.15 కే, అంటే 28శాతం తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు.

టికెట్​ ఫర్​ టూ (8 గంటలు)- దీని వాస్తవ ధర రూ. 3015.2. ఆఫర్​లో దీనిని రూ. 1999.15కే కొనుగోలు చేయవచ్చు. అంటే దీనిపై ఏకంగా 34శాతం తగ్గింపు లభిస్తున్నట్టు.

వీటి ద్వారా ప్రపంచ స్థాయి రైడ్స్‌ను 8, 11 గంటల పాటు అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేయవచ్చు.

ఈవెనింగ్ కపుల్ టికెట్: సాయంత్రం 5:30 నుంచి పార్క్ వెలుగుల మధ్య రొమాంటిక్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి డిన్నర్ ఆప్షన్‌ను కూడా జోడించుకోవచ్చు.

కాంబో ప్యాకేజీలు: రైడ్స్‌తో పాటు వేవ్ పూల్ డిన్నర్ లేదా బఫే కలిపి ఉండేలా ఈ ప్యాకేజీలు రూపొందించారు.

నక్షత్రాల కింద.. వేవ్ పూల్ డిన్నర్!

అత్యంత అరుదైన అనుభూతిని పొందాలనుకునే వారి కోసం వండర్లా ఐకానిక్ 'స్కై వీల్'పై విందును ఏర్పాటు చేసింది. నగర అందాలను ఆకాశం నుంచి వీక్షిస్తూ ప్రైవేట్ క్షణాలను గడపవచ్చు. ఇందులో బర్గర్లు, బబుల్ టీ, పేస్ట్రీలు వంటివి అందిస్తారు.

ఇది కేవలం ఫిబ్రవరి 14న మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వండర్లా హాలిడేస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధీరన్ చౌదరి మాట్లాడుతూ.. "వండర్లాలో వాలెంటైన్స్ డే అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, అది సాహసం, రొమాన్స్, వినోదాల అద్భుత కలయిక. జంటలు తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేలా ఈ అనుభవాలను తీర్చిదిద్దాం," అని పేర్కొన్నారు.

అడ్రినాలిన్ పెంచే రోలర్ కోస్టర్లు, చిరుజల్లులు కురిపించే వాటర్ రైడ్స్, రొమాంటిక్ ఫొటో స్పాట్స్.. ఇలా హైదరాబాద్​ వండర్లా ప్రేమికుల కోసం ముస్తాబవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ వాలెంటైన్స్‌ డే 2026ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోండి!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks