ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ వజ్రం వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మైదానంలో అతను చూపించిన ఈ విధ్వంసకర బ్యాటింగ్ వెనుక కఠినమైన క్రమశిక్షణ దాగి ఉంది. ఈ అంకితభావమే అతడిని అతిచిన్న వయసులోనే ఐపీఎల్ స్టార్‌గా మార్చిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బర్త్‌డే వేడుకలకు నో

మార్చి 27న వైభవ్ తన 15వ ఏట అడుగుపెట్టినా బర్త్ డే వేడుకల కంటే ఆటకే ప్రాధాన్యత ఇచ్చాడు. "కేక్ కటింగ్ ఉండాల్సింది, కానీ నా మొహానికి కేక్ పూయించుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం త్వరగా నిద్రపోవాలని అనుకున్నా. అందుకే కేక్ కట్ చేయలేదు" అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ చిన్న వయసులో వైభవ్ చూపిన అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పవర్‌ప్లేలో పక్కా ప్లాన్
ఐపీఎల్ 2026లో సోమవారం (మార్చి 30) రాత్రి మ్యాచ్ లో సీఎస్కే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ పక్కాగా ప్లాన్ అమలు చేశాడు. పవర్‌ప్లేలోనే జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 305.88 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చేసింది. పవర్‌ప్లేలో బౌలర్లపై ఒత్తిడి తెచ్చి మ్యాచ్‌ను ఏకపక్షం చేయడంలో వైభవ్ వ్యూహం పూర్తిగా సక్సెస్ అయింది.
{{/usCountry}}ఐపీఎల్ 2026లో సోమవారం (మార్చి 30) రాత్రి మ్యాచ్ లో సీఎస్కే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ పక్కాగా ప్లాన్ అమలు చేశాడు. పవర్‌ప్లేలోనే జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 305.88 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చేసింది. పవర్‌ప్లేలో బౌలర్లపై ఒత్తిడి తెచ్చి మ్యాచ్‌ను ఏకపక్షం చేయడంలో వైభవ్ వ్యూహం పూర్తిగా సక్సెస్ అయింది.
{{/usCountry}}జైస్వాల్, కోచ్‌ల భరోసా
ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ తనకు మైదానంలో నిరంతరం మద్దతు ఇస్తున్నాడని వైభవ్ తెలిపాడు. ప్రతి బంతి తర్వాత జైస్వాల్ గైడ్ చేస్తూ, ఎప్పుడు షాట్లు ఆడాలో సూచిస్తున్నాడని వెల్లడించాడు. కోచ్‌లు కూడా తన సహజమైన ఆటను ఆడమని ప్రోత్సహిస్తూ తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు తన బ్యాట్‌తోనే అందరి విమర్శలకు సమాధానం చెబుతూ దూసుకుపోతున్నాడు.
గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2026ను రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీతో మొదలెట్టింది. సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 128 పరుగుల ఛేజింగ్ ను కేవలం 12.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 17 బాల్స్ లోనే 52 రన్స్ కొట్టాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ లో వైభవ్ కు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఓవరాల్ గా ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.