...
...
Next Story

Protein rich foods : శాకాహారంలో లభించే 5 హై ప్రొటీన్ ఫుడ్స్ ఇవే..

హై ప్రొటీన్ డైట్ అనగానే చాలామందికి చికెన్, గుడ్లు మాత్రమే గుర్తుకొస్తాయి. వెజిటేరియన్లకు అసలు సరైన ప్రోటీన్ లభించదని భావిస్తుంటారు. కానీ, అనేక వెజిటేరియన్ ఆహారాల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 5, 2026, 11:21:38 IST
Advertisement
<p>సోయాబీన్: శాఖాహారంలో ప్రొటీన్ల విషయానికి వస్తే సోయాబీన్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR-IFCT) నివేదికల ప్రకారం.. 100 గ్రాముల పొడి సోయాబీన్‌లో ఏకంగా 36 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. మాంసాహారంలో లభించే అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ సోయాలో ఉండటం దీని ప్రత్యేకత. సోయా చంక్స్, సోయా పాలు లేదా టోఫు రూపంలో దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.</p>

సోయాబీన్: శాఖాహారంలో ప్రొటీన్ల విషయానికి వస్తే సోయాబీన్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR-IFCT) నివేదికల ప్రకారం.. 100 గ్రాముల పొడి సోయాబీన్‌లో ఏకంగా 36 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. మాంసాహారంలో లభించే అత్యవసరమైన అమినో యాసిడ్లన్నీ సోయాలో ఉండటం దీని ప్రత్యేకత. సోయా చంక్స్, సోయా పాలు లేదా టోఫు రూపంలో దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

మసూర్ పప్పు : మన రోజువారీ వంటకాల్లో వాడే మసూర్ పప్పులోనూ ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల పొడి మసూర్ పప్పులో సుమారు 24 నుంచి 25 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అయితే పప్పు ఉడికిన తర్వాత నీటిని పీల్చుకోవడం వల్ల దాని బరువు పెరుగుతుంది కాబట్టి, పొడి పప్పు లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది.

కందిపప్పు: తెలుగువారి ఇళ్లలో రోజూ చేసుకునే పప్పు వంటకాల్లో కందిపప్పుదే ప్రధాన పాత్ర. 100 గ్రాముల పచ్చి కందిపప్పులో దాదాపు 21 నుంచి 22 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. సాంబార్, పప్పుచారు లేదా ముద్దపప్పు రూపంలో నిత్యం తీసుకునే ఈ కందిపప్పు శాఖాహారులకు చక్కటి పోషణను అందిస్తుంది.

పనీర్: శాఖాహారులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే పోషకాహారం పనీర్. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18.9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పనీర్ భుర్జీ, టిక్కా, పనీర్ కూరలు లేదా పరాఠాల రూపంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. రోజువారీ డైట్‌లో ప్రొటీన్ పెంచుకోవడానికి పనీర్ సరైన ఎంపిక.

రాజ్మా (కిడ్నీ బీన్స్): ఉత్తరాదినే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన రాజ్మాలో ప్రొటీన్లతో పాటు ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఎండిన రాజ్మా గింజల్లో దాదాపు 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks