2026 Festival List: 2026లో పండుగలు ఎప్పుడు, అధిక మాసం ఎప్పటి నుంచి? జనవరి నుంచి డిసెంబర్ వరకు పండుగల లిస్ట్ ఇదిగో!
ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం, అనేక ముఖ్యమైన వ్రతాలు, పండుగల తేదీలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి కారణం అధిక మాసం ఉండటమే. ఈ ఏడాది అధిక మాసం 2026 మే 17 నుంచి ప్రారంభమై, జూన్ 15, 2026న ముగుస్తుంది. 2026లో నవరాత్రి, హోలీ, దీపావళి, రాఖీ పౌర్ణమితో సహా అనేక పెద్ద పండుగలు తేదీలను తెలుసుకుందాం.
2026 పండుగలు: 2026 జనవరి 1, గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం, అనేక ముఖ్యమైన వ్రతాలు, పండుగల తేదీలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి కారణం అధిక మాసం ఉండటమే. ఈ సమయంలో అన్ని వ్రతాలు, పండుగలు ఒక నెల ముందుకు జరుగుతాయి. 2026లో ఒక ముఖ్యమైన శుభ పరిణామం ఏమిటంటే, జ్యేష్ఠ మాసంలో అధిక మాసం రానుంది. దీని వల్ల కొన్ని పండుగల తేదీలలో మార్పులు సంభవించవచ్చు. అధిక మాసంలో సూర్య సంక్రాంతి ఉండదు. అందువల్ల, అధిక మాసాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో జపం, తపం, దానం చేయడం మంచిది.

అధిక మాసంలో గృహ ప్రవేశం, వివాహం, యజ్ఞోపవీతం, నామకరణం వంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. అధిక మాసంలో వివాహాలు నిశ్చయించుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం, భూమి, ఇల్లు వంటి వాటికి సంబంధించిన పనులు చేయవచ్చు. ఈ ఏడాది అధిక మాసం 2026 మే 17 నుంచి ప్రారంభమై, జూన్ 15, 2026న ముగుస్తుంది. 2026లో మొదటి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది 2026లో నవరాత్రి, హోలీ, దీపావళి, రాఖీ పౌర్ణమితో సహా అనేక పెద్ద పండుగలు తేదీలను తెలుసుకుందాం.
2026 పండుగలు
3 జనవరి: మాఘ స్నానం
6 జనవరి: సంకట చతుర్థి
14 జనవరి: భోగి
15 జనవరి: మకర సంక్రాంతి, షట్తిల ఏకాదశి
16 జనవరి: కనుమ
18 జనవరి: మౌనీ అమావాస్య
23 జనవరి: వసంత పంచమి, సరస్వతి పూజ
26 జనవరి: భీష్మ అష్టమి
29 జనవరి: జయ ఏకాదశి
ఫిబ్రవరి 2026
1 ఫిబ్రవరి: మాఘ పౌర్ణమి, గురు రవిదాస్ జయంతి
13 ఫిబ్రవరి: విజయ ఏకాదశి
15 ఫిబ్రవరి: మహా శివరాత్రి
24 ఫిబ్రవరి: అన్నపూర్ణ అష్టమి
27 ఫిబ్రవరి: ఆమలకి ఏకాదశి
మార్చి 2026
2 మార్చి: హోలికా దహనం
3 మార్చి: హోలీ
11 మార్చి: శీతల అష్టమి
15 మార్చి: పాపమోచని ఏకాదశి
26 మార్చి: రామ నవమి
29 మార్చి: కామద ఏకాదశి
31 మార్చి: మహావీర్ జయంతి
ఏప్రిల్ 2026
2 ఏప్రిల్: హనుమాన్ జయంతి
3 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే
14 ఏప్రిల్: ఉగాది
19 ఏప్రిల్: పరశురామ జయంతి, అక్షయ తృతీయ
27 ఏప్రిల్: మోహిని ఏకాదశి
మే 2026
13 మే: భద్రకాళీ ఏకాదశి
16 మే: వటసావిత్రి వ్రతం
17 మే: అధిక మాసం ప్రారంభం
జూన్ 2026
15 జూన్: సోమవతి అమావాస్య
25 జూన్: నిర్జల ఏకాదశి
జూలై 2026
17 జూలై: శ్రీ జగన్నాథ రథయాత్ర
25 జూలై: హరిశయని ఏకాదశి, చాతుర్మాస ప్రారంభం
29 జూలై: గురు పౌర్ణమి
ఆగస్టు 2026
17 ఆగస్టు: నాగ పంచమి
19 ఆగస్టు: తులసీదాస్ జయంతి
28 ఆగస్టు: శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్
31 ఆగస్టు: వినాయక చవితి
సెప్టెంబర్ 2026
1 సెప్టెంబర్: కృష్ణ జన్మాష్టమి
14 సెప్టెంబర్: సంకష్టి చతుర్థి
17 సెప్టెంబర్: సూర్య షష్ఠీ వ్రతం
25 సెప్టెంబర్: అనంత చతుర్దశి
27 సెప్టెంబర్: పితృ పక్షం ప్రారంభం
అక్టోబర్ 2026
10 అక్టోబర్: పితృ పక్షం ముగింపు
11 అక్టోబర్: నవరాత్రి ప్రారంభం
20 అక్టోబర్: మహానవమి, నవరాత్రి ముగింపు; దసరా
22 అక్టోబర్: పాపాంకుశా ఏకాదశి
26 అక్టోబర్: వాల్మీకి జయంతి
29 అక్టోబర్: కర్వా చౌత్
నవంబర్ 2026
5 నవంబర్: గోవత్స ద్వాదశి; రమా ఏకాదశి
8 నవంబర్: నరక చతుర్దశి, దీపావళి
9 నవంబర్: కార్తీక అమావాస్య, సోమవతి అమావాస్య
10 నవంబర్: గోవర్ధన పూజ
15 నవంబర్: సూర్య షష్టి
20 నవంబర్: తులసీ వివాహం
21 నవంబర్: హరిప్రబోధిని ఏకాదశి
23 నవంబర్: వైకుంఠ చతుర్దశి
24 నవంబర్: కార్తీక పౌర్ణమి
డిసెంబర్ 2026
1 డిసెంబర్: కాలభైరవ జయంతి
4 డిసెంబర్: ఉత్పన్న ఏకాదశి
20 డిసెంబర్: మోక్షదా ఏకాదశి, గీతా జయంతి
23 డిసెంబర్: మార్గశిర పౌర్ణమి
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


