...
...
Next Story

Misunderstood Zodiac Signs: ఈ 6 రాశుల వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు.. అసలు స్వభావం ఏమిటో తెలుసుకోండి!

ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారిని సమాజంలో ఎక్కువగా అపార్థం చేసుకుంటారు. వృశ్చిక రాశి వారిని ప్రతీకార భావన కలవారిగా, మిథున రాశి వారిని ద్వంద్వ స్వభావం ఉన్నవారిగా, కుంభ రాశి వారిని భావోద్వేగాలు లేనివారిగా భావిస్తారు.

Published on: Jun 16, 2026, 12:30:21 IST
Advertisement

మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తనతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష్యం అంటే మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక మంచి మార్గం కూడా. ఒక రాశిని బట్టి వ్యక్తి గురించి అంచనా వేయొచ్చు. అలా తెలుసుకోవాలంటే ఆ రాశికి ఉన్న అంతరార్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Misunderstood Zodiac Signs: ఈ 6 రాశుల వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు.. అసలు స్వభావం ఏమిటో తెలుసుకోండి! (pinterest)
Misunderstood Zodiac Signs: ఈ 6 రాశుల వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు.. అసలు స్వభావం ఏమిటో తెలుసుకోండి! (pinterest)

అయితే, కొన్ని రాశుల వారిని అపార్థంగా కూడా అర్థం చేసుకుంటారు. అలాంటి రాశుల వారు ఎవరు? ఆ రాశుల వారిని తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ప్రతీకారం తీర్చుకుంటారని వారి పైన ముద్రలు బలంగా ఉన్నాయి. కానీ నిజానికి, ప్రతి విషయాన్ని కూడా వృశ్చిక రాశి వారు గాఢంగా అనుభవిస్తారు. మిగిలిన వారు భరించలేనంత తీవ్రమైన భావోద్వేగాలను వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారిని నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు. కానీ వారి భావోద్వేగ తీవ్రతను విషపూరితమైనదిగా భావించడం ఏమాత్రం సరైనది కాదు.

మిథున రాశి

మిథున రాశి వారు ద్వంద్వ స్వభావం కలవారని చాలా మంది అనుకుంటారు. కానీ వారు ఒక విషయంపై అభిప్రాయాన్ని మార్చుకుంటే, దాని అర్థం వారు అబద్ధం చెప్పారని కాదు. కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అర్థం. ప్రతి పరిస్థితినీ అన్ని కోణాల్లో చూడగల సామర్థ్యం వీరికి ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఎమోషనల్ కాదని, రోబోలా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వీరు సమాజం గురించి, ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉంటారు. వ్యక్తిగత సంబంధాల కంటే కూడా మానవత్వం కోసం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు.

మకర రాశి

మేష రాశి వారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. పైగా సూటిగా మాట్లాడుతారు. అయితే చాలా మంది వీరిని అహంకారులు అని అనుకుంటారు. కానీ లక్ష్యాలను సాధించడానికి ఉన్న ఆత్మవిశ్వాసమే దానికి కారణం. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మేష రాశి వారికి ఉన్నంత సాహసం ఇంకా ఎవరికీ ఉండదు.

మీన రాశి

మీన రాశి వారు అమాయకులని, బలహీనతతో ఉంటారని తక్కువ అంచనా వేస్తారు. కానీ వీరు ఇతరులలోని చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించగలరు. అలాగే ఇతరులు బాధలో ఉంటే ఏమాత్రం చూడలేరు. ప్రతి విషయాన్ని కూడా ఎంతో లోతుగా ఆలోచిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks