ఈ ఏడాది మొత్తం 13 తెలుగు నెలలు వచ్చాయి. జ్యేష్ఠ మాసం రెండు నెలలు ఉండడంతో ఒక నెల ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఎప్పుడు నుంచి మొదలవుతుంది? అధిక మాసం అంటే అర్థం ఏంటి? ఈ నెలలో చేయవలసినవి, చేయకూడని పనులు ఏంటి? ఇలా పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక జ్యేష్ఠ మాసం 2026:

అధిక జ్యేష్ఠ మాసం మే 17, ఆదివారం నుంచి మొదలవుతుంది. జూన్ 15, సోమవారంతో ముగుస్తుంది. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 13 వరకు ఉంటుంది.
అసలు అధికమాసం అంటే ఏంటి?
హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే సుమారు ప్రతి 32 లేదా 33 నెలలకు ఒకసారి అదనపు నెల వస్తుంది. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. జ్యేష్ఠ మాసం విష్ణువుకి అంకితం చేయబడింది. వివాహాలు, గృహప్రవేశం లాంటి శుభకార్యాలను అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అధిక మాసంలో జపం, దానాలు, ధ్యానం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
మే 17 నుంచి జూన్ 15 వరకు ఈ పనులు చేయకండి:
ఈ సమయం అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి కొన్ని తప్పులు చేయకూడదు.
- వివాహాలు చేయకూడదు.
- గృహప్రవేశాలు చేయకూడదు.
- ఇల్లు మారకూడదు.
- అప్పులు తీసుకోవడం మంచిది కాదు.
- కొత్త వ్యాపారాలు మొదలుపెట్టకూడదు.
ఈ నెలలో విష్ణువుని పూజిస్తే కోరికలు అన్నీ కూడా తీరుతాయి. తులసి దేవిని ఆరాధించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అధిక జ్యేష్ఠ మాసంలో ఐశ్వర్యం కలగాలంటే ఇలా చేయండి:
అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు. కానీ కొన్ని పనులు చేస్తే మాత్రం సంపద పెరుగుతుంది. ఎక్కడ లేనంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఆరోగ్యం కలగాలన్నా, మంచి పేరు ప్రతిష్టలు పొందాలన్నా అధికమాసం అనేది చాలా ముఖ్యమైన సమయం అని చెప్పొచ్చు.
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిది
{{/usCountry}}అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు. కానీ కొన్ని పనులు చేస్తే మాత్రం సంపద పెరుగుతుంది. ఎక్కడ లేనంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఆరోగ్యం కలగాలన్నా, మంచి పేరు ప్రతిష్టలు పొందాలన్నా అధికమాసం అనేది చాలా ముఖ్యమైన సమయం అని చెప్పొచ్చు.
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిది
{{/usCountry}}అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు.
హనుమాన్ చాలీసాను పఠించండి
ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా హనుమాన్ చాలీసాను పఠించండి. అధిక మాసంలో ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. ఈ నెలంతా 54, 108 ఇలా మీకు నచ్చినన్ని సార్లు పారాయణ చేయండి. దీంతో హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది. కోరిక కూడా ఫలిస్తుంది.
అరటి పండ్లు, కొబ్బరికాయ లేదా హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులను సమర్పించండి. పారాయణం మొత్తం పూర్తయిపోయిన తర్వాత హనుమంతుడికి 22 గారెలు చేసి నివేదన చేయండి. ఇలా చేయడం వలన మీ కోరిక తప్పక నెరవేరుతుందని నమ్మకం. మళ్లీ అధికమాసం రావడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ అధికమాసాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.