ఆగస్టు, సెప్టెంబర్‌లో పుట్టినవారిలో ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయట.. నాయకత్వంలోనూ, తెలివితేటల్లోనూ ముందుంటారట!

పుట్టిన నెల ఆధారంగా కూడా వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చని జ్యోతిష్యం, న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతున్నాయి. ఆగస్టు నెలలో పుట్టినవారు సహజ నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, కుటుంబంపై ప్రేమ వంటి గుణాలు కలిగి ఉంటారని, కొన్నిసార్లు మొండితనం కూడా కనిపిస్తుందని చెబుతారు. 

Published on: Jul 31, 2026, 12:31:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను అంచనా వేయొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? ఈ రెండు నెలల్లో పుట్టిన వారి ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే తీరు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రెండు నెలల్లో మీరు పుట్టినట్లయితే, మీ వ్యక్తిత్వం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆగస్టు, సెప్టెంబర్‌లో పుట్టినవారిలో ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయట.. నాయకత్వంలోనూ, తెలివితేటల్లోనూ ముందుంటారట!
ఆగస్టు, సెప్టెంబర్‌లో పుట్టినవారిలో ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయట.. నాయకత్వంలోనూ, తెలివితేటల్లోనూ ముందుంటారట!

ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ప్రత్యేక లక్షణాలు తెలుసుకోండి

ఆగస్టు నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం గురించి రహస్యాలు

సహజ నాయకత్వ లక్షణాలు

ఆగస్టు నెలలో పుట్టిన వారు సహజ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ పని చేసినా వారు ముందుండి నడిపిస్తారు. ఇలాంటి విషయాల్లో వారికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.

సృజనాత్మకత

ఆగస్టు నెలలో పుట్టిన వారికి సృజనాత్మకత ఎక్కువ. కొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతులతో పనులు చేయడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. సాహిత్యం, కళలు, వ్యాపార రంగాల్లో బాగా రాణించగలరు.

ఆత్మవిశ్వాసం ఎక్కువ

ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు.

కుటుంబానికి ప్రాధాన్యత

ఆగస్టు నెలలో పుట్టిన వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అవసరమైనప్పుడు వారికి తోడుగా ఉంటారు.

మొండితనం ఉంటుంది

ఆగస్టు నెలలో పుట్టిన వారు కొన్నిసార్లు కాస్త మొండిగా ఉంటారు. ఇదే వారి బలహీనతగా మారుతుంది. కొన్నిసార్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?

మీరు సెప్టెంబర్ నెలలో పుట్టారా? అయితే మీ వ్యక్తిత్వం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

బాధ్యతాయుత స్వభావం

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు చాలా బాధ్యతగా ఉంటారు. ఏ పని అప్పగించినా నిబద్ధతతో పూర్తి చేయగలరు. అందుకే ఆఫీసులో వీరిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది.

తెలివితేటలు ఎక్కువ

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు.

క్రమశిక్షణకు మారుపేరు

క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పనులు చేయడం, సమయపాలన పాటించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

ప్రశాంతమైన వ్యక్తిత్వం

అనవసరమైన గొడవలకు సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు దూరంగా ఉంటారు. సమస్యలను ఎంతో ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.

పరిపూర్ణత కోసం ప్రయత్నం

చేసే ప్రతి పనిలో ఉత్తమ ఫలితం రావాలని ఈ నెలలో పుట్టిన వారు కోరుకుంటారు. కొన్నిసార్లు చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.

సెప్టెంబర్, ఆగస్టు నెలలో పుట్టిన వారు ఇలా ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారని జ్యోతిష్యం, న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే కేవలం పుట్టిన నెల ఆధారంగానే వ్యక్తిత్వం నిర్ణయించబడదు. కుటుంబ వాతావరణం, విద్య, జీవిత అనుభవాలు వంటి అనేక అంశాలు కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More