...
...
Next Story

సూర్యాస్తమయం తర్వాత ఈ 5 ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.. ఇంటి ఐశ్వర్యం, శ్రేయస్సుపై ప్రభావం పడొచ్చు!

మన హిందూ సంప్రదాయంలో దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే, సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా దానం చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం...

Published on: Jun 3, 2026, 16:30:18 IST
Advertisement

మన హిందూ సంప్రదాయంలో దానధర్మాలకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. పురాణాలు, శాస్త్రాల ప్రకారం దానాలు చేయడానికి కొన్ని నియమాలు, సమయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా పాటించేటట్టు చూడాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో దానం చేయడం వలన పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఈ విషయంలో హెచ్చరిస్తున్నారు.

సూర్యాస్తమయం తర్వాత ఈ 5 ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.. ఇంటి ఐశ్వర్యం, శ్రేయస్సుపై ప్రభావం పడొచ్చు! (pinterest)
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.. ఇంటి ఐశ్వర్యం, శ్రేయస్సుపై ప్రభావం పడొచ్చు! (pinterest)

ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు. దాని వలన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది. సాయంత్రం వేళ ప్రదోషకాలంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ ఐదు వస్తువులను ఇతరులకు ఇస్తే దరిద్రం తప్పదు అని గుర్తుపెట్టుకోండి.

పొరపాటున కూడా సూర్యాస్తమయం అయ్యాక ఈ వస్తువులను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోండి

1.పసుపు

పసుపును హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా, శుభానికి చిహ్నంగా భావిస్తాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురు గ్రహానికి ప్రతిరూపం. సూర్యాస్తమయం అయిన తర్వాత పసుపును ఎవరికీ కూడా ఇవ్వకూడదు, దానం చేయకూడదు. అలా చేయడం వలన గురు బలం క్షీణిస్తుంది. గురు గ్రహం ప్రభావం తగ్గినట్లయితే వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి, నష్టాలు కలుగుతాయి. ఆర్థికపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. శుభకార్యాలు ఆగిపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.

2.పెరుగు

పెరుగు మనశ్శాంతి, సంపదకు, చల్లదనానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పెరుగు అనేది శుక్ర గ్రహానికి, చంద్రుడికి సంబంధించినది. చీకటి పడ్డాక పెరుగును ఇతరులకు ఇవ్వకూడదు. ఇంటి ప్రగతి కుంటుపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగును సాయంత్రం ఎవరికైనా ఇవ్వడం వలన తగ్గిపోతుంది. పెరుగును రాత్రిపూట ఎవరికీ ఇవ్వకండి. అప్పుడు శుభ ఫలితాలను చూడవచ్చు.

3.ఉప్పు

చీకటి పడ్డాక ఎవరికి డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. రోజంతా కష్టపడి సంపాదిస్తాము. లక్ష్మీదేవిని సాయంత్రం ఇతరులకు అప్పుగా ఇవ్వడం లేదా దానంగా ఇవ్వడం మంచిది కాదు. చీకటి పడే సమయంలో ఎవరికైనా డబ్బు ఇస్తే అదృష్టం తగ్గిపోతుంది. పేదరికంతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవాలి.

5.పాలు

పాలు విష్ణువుతో పాటు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మీ అనుగ్రహం పాలలో ఉంటుంది. చీకటి పడ్డాక ఎవరికి పాలను ఇవ్వకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. సంపద కూడా కరిగిపోతుంది.

సాయంత్రం పూట వీటిని కూడా పాటిస్తే మంచిది

చీకటి పడే సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు. లక్ష్మీదేవి ఆ సమయంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి తలుపులను తెరిచి ఉంచాలి. కుదిరితే సాయంత్రం సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇంట్లో లైట్లను ఆన్ చేసి పెట్టండి. చీకటి లేకుండా చూసుకోండి. అలాగే సాయంత్రం పూట తులసి ఆకులను తెంపకూడదు. అలా చేయడం వలన పాపం కలుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks