అమావాస్య విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేపు ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పూర్వికులను స్మరించుకుని రేపు హరియాలి అమావాస్య వేళ వీటిని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. సంతోషం రెట్టింపు అవుతుంది, సంపద పెరుగుతుంది. అమావాస్య వేళ ఏ రాశి వారు వెంటనే దానం చేయాలి?
మేష రాశి

మేష రాశి వారు ఎరుపు రంగులో ఉండే దుస్తులను దానం చేయడం మంచిది. అలాగే ఎర్రటి పప్పులు, రాగి వస్తువులను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారు రేపు అమావాస్య వేళ పాలు, బియ్యం, పంచదార, తెల్లటి వస్త్రాలను దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారు పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని కూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు పాలు, బియ్యం, వెండి, తెల్ల రంగులో ఉండే స్వీట్లు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. పూర్వికుల అనుగ్రహం కూడా కలుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారు బెల్లం, రాగి వస్తువులు, ఎర్రటి పండ్లు వంటివి దానం చేస్తే మంచిది. బాగా కలిసి వస్తుంది. పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది.
కన్య రాశి
మొక్కలు, పెసలు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే అవసరమైన విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వలన కూడా మంచి ఫలితాలను చూస్తారు.
తులా రాశి
తులా రాశి వారు తెల్లటి వస్త్రాలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}తులా రాశి వారు తెల్లటి వస్త్రాలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారు పప్పులు, బెల్లం, వస్త్రాలు దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య వల్ల ఈ పరిహారాలను పాటిస్తే మంచి మార్పులు చూస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు వస్త్రాలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను చూడొచ్చు.
మకర రాశి
మకర రాశి వారు నల్ల నువ్వులు, ఆవాల నూనె వంటివి దానం చేస్తే బాగుంటుంది. అలాగే చెప్పులు, దుప్పట్లు వంటివి పేదవారికి దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, గొడుగు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మీన రాశి
మీన రాశి వారు పప్పులు, శనగ పిండి లడ్డూలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా దానం చెయ్యచ్చు.