ఆషాఢ అమావాస్య 2026: రేపు 12 రాశుల వారు చేయాల్సిన దానాలు ఇవే!
ఆషాఢ అమావాస్య సందర్భంగా పూర్వీకులను స్మరించుకుంటూ పరిహారాలు పాటించడం శుభప్రదంగా భావిస్తారు. రాశిని బట్టి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు రంగుల వస్త్రాలు, పప్పులు, బియ్యం, పాలు, నువ్వులు, రాగి వస్తువులు, దుప్పట్లు, చదువుకు సంబంధించిన వస్తువులు వంటి వాటిని దానం చేయాలని ఈ కథనంలో సూచించారు.
అమావాస్య విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేపు ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పూర్వికులను స్మరించుకుని రేపు హరియాలి అమావాస్య వేళ వీటిని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. సంతోషం రెట్టింపు అవుతుంది, సంపద పెరుగుతుంది. అమావాస్య వేళ ఏ రాశి వారు వెంటనే దానం చేయాలి?

మేష రాశి
మేష రాశి వారు ఎరుపు రంగులో ఉండే దుస్తులను దానం చేయడం మంచిది. అలాగే ఎర్రటి పప్పులు, రాగి వస్తువులను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారు రేపు అమావాస్య వేళ పాలు, బియ్యం, పంచదార, తెల్లటి వస్త్రాలను దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారు పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని కూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు పాలు, బియ్యం, వెండి, తెల్ల రంగులో ఉండే స్వీట్లు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. పూర్వికుల అనుగ్రహం కూడా కలుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారు బెల్లం, రాగి వస్తువులు, ఎర్రటి పండ్లు వంటివి దానం చేస్తే మంచిది. బాగా కలిసి వస్తుంది. పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది.
కన్య రాశి
మొక్కలు, పెసలు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే అవసరమైన విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వలన కూడా మంచి ఫలితాలను చూస్తారు.
తులా రాశి
తులా రాశి వారు తెల్లటి వస్త్రాలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు పప్పులు, బెల్లం, వస్త్రాలు దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య వల్ల ఈ పరిహారాలను పాటిస్తే మంచి మార్పులు చూస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు వస్త్రాలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను చూడొచ్చు.
మకర రాశి
మకర రాశి వారు నల్ల నువ్వులు, ఆవాల నూనె వంటివి దానం చేస్తే బాగుంటుంది. అలాగే చెప్పులు, దుప్పట్లు వంటివి పేదవారికి దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, గొడుగు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మీన రాశి
మీన రాశి వారు పప్పులు, శనగ పిండి లడ్డూలు వంటివి దానం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా దానం చెయ్యచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


