...
...
Next Story

ఆగస్టులో నాలుగు సార్లు సూర్య గమనం మార్పు.. ఈ రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబంలో శుభయోగాలు!

సూర్య భగవానుడు నాలుగు సార్లు తన గమనంలో మార్పులు చేయనున్నారు. ఆగస్టు 3న అశ్లేష నక్షత్రంలోకి, ఆగస్టు 17న మఘ నక్షత్రంతో పాటు స్వరాశి అయిన సింహరాశిలోకి, ఆగస్టు 31న పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. సింహం, మేషం, ధనుస్సు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది.

Published on: Jul 22, 2026, 14:01:12 IST
Advertisement

గ్రహాల రారాజు అయిన సూర్య భగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే రాబోయే ఆగస్టు నెలలో సూర్యుడు ఏకంగా నాలుగు సార్లు తన గమనాన్ని మార్చుకోబోతున్నారు.

ఆగస్టు నెలలో నాలుగు సార్లు సూర్య సంచారంలో మార్పు

ఆగస్టులో నాలుగు సార్లు సూర్య గమనం మార్పు.. ఈ రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబంలో శుభయోగాలు! (pinterest)
ఆగస్టులో నాలుగు సార్లు సూర్య గమనం మార్పు.. ఈ రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబంలో శుభయోగాలు! (pinterest)

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సాధారణంగా నెల రోజులకు ఒకసారి రాశి మారుస్తుండగా, నక్షత్ర మార్పు మాత్రం ప్రతి 13 నుంచి 15 రోజులకు జరుగుతుంది. ఆగస్టు 3న అశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించే సూర్యుడు, ఆగస్టు 17న మఘ నక్షత్రంలోకి, అలాగే ఆగస్టు 31న పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి గోచరంచనున్నారు.

ఇక అత్యంత ముఖ్యమైన పరిణామంగా, సరిగ్గా ఏడాది తర్వాత సూర్య భగవానుడు తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి ఆగస్టు 17న అడుగుపెట్టనున్నారు. ఇలా ఆగస్టు నెలలో సూర్యుడి ఈ వరుస మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ, కొన్ని ప్రత్యేక రాశుల వారికి మాత్రం ఇది గోల్డెన్ పీరియడ్ లాంటిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు వేగవంతం కావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవడం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం జరుగుతుంది. మరి ఆగస్టులో సూర్య గోచరంతో ఏయే రాశుల జీవితం మారుతుందో ఇక్కడ చూద్దాం.

సింహ రాశి: అదృష్టం తలుపు తట్టే సమయం

సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తుండటంతో సింహ రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

మేష రాశి వారికి సూర్య సంచారం ధన, ఉద్యోగ పరంగా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఊపందుకుంటాయి. వ్యాపారస్తులకు లాభాలు గడించే సమయం ఇది. కుటుంబంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది.

పెట్టుబడులు పెట్టడానికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడే సరైన ముందడుగు వేయవచ్చు. ఆఫీసులో పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో రావలసిన పాత బాకీలు చేతికి అందుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

ధనుస్సు రాశి: వ్యాపారంలో ఊహించని వృద్ధి

ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడి ప్రభావం విశేషమైన లాభాలను ఇస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా కొత్త పనులు చేపట్టడానికి ఇది సరైన తరుణం.

కార్యాలయంలో మీకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు, వాటిని సమర్థవంతంగా నిర్వహించి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడి పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. భౌతిక సుఖసౌఖ్యాలు పెరుగుతాయి. అయితే ఈ సమయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe