...
...
Next Story

ఆగస్టు 8 నుంచి ఈ రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు, చంద్రుడు కలయికతో ఆగస్టు 8న మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం ప్రభావంతో కన్యా, మకర, కుంభ, ధనస్సు రాశుల వారికి ఆదాయం పెరగడం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం, విదేశీ అవకాశాలు, నిలిచిపోయిన ధనం తిరిగి రావడం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం.

Published on: Jul 28, 2026, 08:01:08 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహాలతో సంయోగం కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మంచి ఫలితాలు, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 8 నుంచి ఈ రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు.. మీ రాశి ఉందా?
ఆగస్టు 8 నుంచి ఈ రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్యం ప్రకారం, కొన్ని గ్రహాల కలయిక అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కుజుడు, చంద్రుడి కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. ఆగస్టు 8న ఏర్పడబోయే ఈ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. మరి మహాలక్ష్మి రాజయోగం ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఈ రెండున్నర రోజుల పాటు ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి విద్యార్థులకు కూడా ఇది శుభసమయం. విదేశీ విద్యకు సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో లాభాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది.

మకర రాశి

మకర రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో పురోగతిని చూస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. పలుకుబడి ఉన్న వారి మద్దతు మీకు లభిస్తుంది. తండ్రికి సంబంధించిన ఆస్తుల విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మారాలనుకుంటే కూడా ఇది శుభసమయమని చెప్పొచ్చు.

కుంభ రాశి

ధనస్సు రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాల్లో పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం చూస్తున్న వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ రాశి వారికి వివిధ మార్గాల ద్వారా డబ్బు కూడా వస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe