సంవత్సరంలోని మిగతా నెలలతో పోలిస్తే ఆగస్టు నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వ శైలే వేరుగా ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా యిట్టె అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అంకెలు, గ్రహాల గతులను విశ్లేషించే న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో జన్మించిన వారిలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం, విషయాలను త్వరగా గ్రహించే శక్తి ఉంటాయి.

ఆగస్టులో పుట్టడం వల్ల వీరిపై సింహ, కన్య రాశుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఎక్కడికెళ్లినా తమదైన ముద్ర వేస్తారు. ముఖ్యంగా సవాళ్లను స్వీకరించడం వీరికి ఇష్టం. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, వీరు వ్యవహరించే తీరు కారణంగా కొందరు అపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
నాయకత్వ లక్షణాలు మెండుగా..
ఆగస్టులో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులను అనుసరించడానికి ఇష్టపడరు. పదే పదే నలుగురిలో ఒకరిగా ఉండటం కంటే, ముందుండి నడిపించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఏ విషయంలోనైనా బాధ్యత తీసుకోవడానికి ముందుంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వీరు బెదిరిపోరు.
సమస్యను చూసి పారిపోకుండా, దానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. తమకున్న ఆత్మవిశ్వాసంతోనే జీవితంలో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో ఉన్న ఈ నాయకత్వ గుణాల కారణంగానే తోటి ఉద్యోగులు లేదా స్నేహితులు తరచుగా వీరి నుంచి సలహాలు కోరుతుంటారు.
బయటకు కఠినం.. లోపల వెన్న
ఆగస్టు నెలలో పుట్టిన వ్యక్తులు మొదటి చూపునకు ఎంతో కఠినంగా, సీరియస్‌గా కనిపిస్తారు. వారిని చూస్తే ఎవరితోనూ అంత త్వరగా కలవలేరనిపిస్తుంది. అయితే, పైకి అలా కనిపించినప్పటికీ తమ వారికి వచ్చేసరికి వీరి మనసు చాలా విశాలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కష్టమొస్తే వారికి సాయం చేయడానికి క్షణం కూడా ఆలోచించరు. తమ వాళ్ల వెన్నంటి నిలవడంలో వీరు ఎప్పుడూ ముందే ఉంటారు. బంధాల్లో నమ్మకానికీ, నిజాయితీకి ఇవి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.
ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు
వీరి ప్రత్యేకత ఏమిటంటే ఎంత పెద్ద సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయరు. ఏదైనా పనుల్లో విఫలమైతే కృంగిపోకుండా, మళ్లీ పట్టుదలతో విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎంతటి కష్టకాలంలోనూ ఆశను వదిలిపెట్టరు. ఈ పట్టుదల గుణమే వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
ఈ స్వభావమే శత్రువులను చేస్తుంది
{{/usCountry}}వీరి ప్రత్యేకత ఏమిటంటే ఎంత పెద్ద సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయరు. ఏదైనా పనుల్లో విఫలమైతే కృంగిపోకుండా, మళ్లీ పట్టుదలతో విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎంతటి కష్టకాలంలోనూ ఆశను వదిలిపెట్టరు. ఈ పట్టుదల గుణమే వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
ఈ స్వభావమే శత్రువులను చేస్తుంది
{{/usCountry}}వీరిలో ఉండే ఒకే ఒక్క బలహీనత ఏమిటంటే మనసులో ఏది ఉంటే అది ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. విషయాలను ఎప్పుడూ దాచిపెట్టరు, గిట్టని వాళ్ల కోసం మాట మార్చరు. ఎదుటివారికి తప్పు అనిపించింది నేరుగా చెప్పేస్తారు. అయితే వీరు ఎవరి మనసైనా నొప్పించాలని అలా మాట్లాడరు.
కానీ వీరు చెప్పే విధానం వల్ల అవతల వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు. ఈ ఒక్క కారణం వల్లే కొందరు వీరు చెడ్డవారని భావిస్తారు, కొన్నిసార్లు బంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.