అరుదైన త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు శుభకాలం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
అక్టోబర్ 17, 2026 న, తులారాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక త్రిగ్రహి యోగాన్ని ఏర్పరుస్తుంది. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ యోగా తులారాశి, కన్య మరియు కుంభరాశి ప్రజలకు కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో లాభపడటానికి అవకాశాలను ఇస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నేడు అక్టోబర్ 17 నుంచి సూర్య భగవానుడు తులారాశిలోకి ప్రవేశించనుండటంతో అద్భుతమైన యోగం ఏర్పడుతోంది.

తులారాశిలో అరుదైన త్రిగ్రాహి యోగం
ఆకాశంలో గ్రహాల గమనం ఎల్లప్పుడూ మానవ జీవితాలపై మరియు ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 17న సూర్య భగవానుడు తులారాశిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ రాశిలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. దీనివల్ల తులారాశిలో సూర్య, బుధ, శుక్రుల కలయికతో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడుతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ త్రిగ్రహి యోగం ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటు ఆర్థిక వ్యవహారాలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ ప్రత్యేక కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తట్టనున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
తులారాశి: కెరీర్లో దూసుకుపోయే సమయం
సూర్యుడి సంచారంతో ఏర్పడుతున్న ఈ త్రిగ్రాహి యోగం తులారాశి వారికి అత్యంత ప్రత్యేకంగా నిలవనుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను చాటుకునేందుకు అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు.
చాలాకాలంగా పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు నూతన పరిచయాలు చాలా లాభసాటిగా మారుతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా ప్లాన్లపై పనిచేయడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్యారాశి: ఆర్థిక లాభాలు, బిజినెస్ విస్తరణ
కన్యా రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా గొప్ప ఊరటను ఇస్తుంది. ఉద్యోగంలో మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలతో పాటు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది.
వ్యాపారంలో కొత్త కస్టమర్లతో కనెక్షన్ ఏర్పడటం వల్ల టర్నోవర్ పెరుగుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ప్లాన్లతో ముందుకు వెళ్లేందుకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంది.
కుంభరాశి: కెరీర్ మార్పునకు సువర్ణావకాశం
కుంభ రాశి వారికి ఈ గ్రహాల కలయిక కెరీర్ పరంగా సరికొత్త మార్గాలను తెరుస్తుంది. ఎప్పటినుంచో ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఇది సరైన తరుణం. అనుకూలమైన ఆఫర్లు లభించే సూచనలు ఉన్నాయి.
వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. పాత పరిచయాలు మరియు నెట్వర్క్ ద్వారా మీ పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవడానికి సరికొత్త మార్గాలు అన్వేషిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


